మూడు రోజుల్లో ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తా వైసీపీ ఎమ్మెల్యే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ysrcp
Updated:  2018-08-31 04:35:42

మూడు రోజుల్లో ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తా వైసీపీ ఎమ్మెల్యే

కొద్దికాలంగా విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ప్ర‌జ‌లు విష జ్వ‌రాల‌తో అల్లాడుతుంటే తెలుగుదేశం పార్టీ నాయ‌కులు పట్టించుకోకుండా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ప్ర‌తిపక్ష‌ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సాలూరు ఎమ్మెల్యే రాజ‌న్న దొర మండిప‌డ్డారు. రానున్న రోజుల్లో టీడీపీ నాయ‌కులు జిల్లాలో ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోకుండా ఇలానే ప్ర‌వ‌ర్తిస్తే తాను ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని, ప్ర‌జ‌ల‌కోసం తాను ఎంత‌వ‌ర‌కు అయినా వెళ్తాన‌ని ఆయ‌న ప్ర‌భుత్వాన్నిహెచ్చ‌రించారు. 
 
ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, సాలూరు మండ‌లంలో కేవ‌లం 15 రోజుల‌కే విష‌జ్వ‌రాల‌తో సుమారు 9 మంది మ‌ర‌ణించార‌ని ఆయ‌న ఆరోపించారు. ప్ర‌జ‌లు మ‌ర‌ణిస్తున్నా కూడా తెలుగుదేశం పార్టీ నాయ‌కులు ప‌ట్టించుకోకుండా ఉన్నార‌ని రాజ‌న్న దొర మండిప‌డ్డారు. 
 
జ్వ‌రాల‌తో మ‌ర‌ణిస్తున్న వారంద‌రు ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం వల్లే మ‌ర‌ణిస్తున్నార‌ని, ఈ మ‌ర‌ణాల‌న్ని ప్ర‌భుత్వ హ‌త్య‌లే అని రాజ‌న్న దొర ఆరోపించారు. మూడు రోజుల్లో ప్ర‌భుత్వం స్పందించ‌కపోతే తాను ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.