మేము అసెంబ్లీ స‌మావేశాల‌కు పాల్గొంటాం బ‌ట్ వ‌న్ కండీష‌న్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ycp
Updated:  2018-09-05 04:12:00

మేము అసెంబ్లీ స‌మావేశాల‌కు పాల్గొంటాం బ‌ట్ వ‌న్ కండీష‌న్

2014లో ఎన్నిక‌ల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తర‌పున పోటీ చేసి గెలిచిన సుమారు 23 మంది ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు వెయ్య‌కుండా అసెంబ్లీ స‌మావేశాలు న‌డుపుతున్నార‌ని ప్ర‌ధాన ప్ర‌తిపక్ష‌ వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణా రెడ్డి మండిప‌డ్డారు. ఈ రోజు పార్టీ కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ, ఫిరాయింపు ఎమ్మెల్యేల‌పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోకుండా ఉన్నందున వైసీపీ త‌ర‌పున స్పీక‌ర్ కోడెల‌ శివ‌ప్ర‌సాద్ రావు కు ఒక బ‌హిరంగ లేఖ‌ను రాశారు. 
 
అంతేకాదు గతంలో కూడా శాస‌న స‌భ్యులుగా తామంద‌రం 8.3.2017లో ఫిరాయింపు ఎమ్మెల్యేల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఒక లెట‌ర్ రాశామ‌ని అయినా స్పీక‌ర్ స్పందించ‌లేద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. అలాగే 27.11. 2017న మ‌రో లెట‌ర్ కూడా రాశామ‌ని ఆయ‌న అన్నారు, కానీ స్పీక‌ర్ ఫిరాయింపుల‌పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేద‌ని రామ‌కృష్ణా రెడ్డి ఆరోపించారు. 
 
దేశంలో ఏ స్పీక‌ర్ చెయ్య‌ని విధంగా కోడెల స‌భ‌ను న‌డుపుతున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. రేపు జ‌రుగ‌బోయే వ‌ర్షాకాల స‌మావేశాల్లో తాము పాల్గొంటామ‌ని ప్ర‌భుత్వం పెట్టే చ‌ర్చ‌ల్లో తాము పాల్గొంటామ‌ని కానీ టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల‌పై చ‌ర్య‌లు తీసుకుంటే ఉద‌యాన్నే స‌మావేశాల్లో పాల్గొంటామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.