వైసీపీ ఫైర్ బ్రాండ్ అరెస్ట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-24 17:51:21

వైసీపీ ఫైర్ బ్రాండ్ అరెస్ట్

ప్ర‌తేక హోదాను డిమాండ్ చేస్తూ, కేంద్ర వైఖ‌రిని ఖండిస్తూ ఈ రోజు ప్ర‌తిప‌క్షనేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు పిలుపునిచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇక పార్టీ అధినేత కోరిక మేర‌కు వైసీపీ నాయ‌కులు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో బంద్ ను నిర్వ‌హిస్తే దీనిని అణ‌చి వేసేందుకు టీడీపీ స‌ర్కారు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ప‌క్కా ప్లాన్ తో ఎక్క‌డ అయితే వైసీపీ నాయ‌కులు బంద్ ను నిర్వ‌హిస్తారో అక్క‌డకి పోలీసులు వెళ్లి వారిని అక్ర‌మంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేష‌న్ కు త‌ర‌లిస్తున్నారు.
 
అయితే ఈ క్ర‌మంలో కొద్ది సేప‌టి క్రిత‌మే వైసీపీ న‌గ‌రి ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ రోజా పుత్తూరులోని వైసీపీ నాయ‌కులు బంద్ ను చేప‌డుతుంటే ఈ బంద్ లో ఆమె పాల్గొన్నారు. ఇక ఈ బంద్ లో పాల్గొన్న రెండు నిమిషాల‌కే పోలీసులు ఆమెను అక్ర‌మంగా అరెస్ట్ చేశారు. రోజాతో పాటు ఎమ్మెల్యే నారాయణస్వామిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
 
అరెస్ట్ అయిన త‌ర్వాత రోజా మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం కేంద్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా బంద్ పాటిస్తే త‌మ‌న అక్ర‌మంగా పోలీసులు అరెస్ట్ చేయ‌డం సిగ్గుచేట‌ని రోజా ఆరోపించారు. అయితే పోలీసులు వైసీపీ నాయ‌కులు అణ‌చివేసినంత మాత్ర‌నా త‌మ పోరాటం ఆగ‌ద‌ని రోజా స్ప‌ష్టం చేశారు. ప్ర‌త్యేక హోదా విష‌యంలో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు రెండు నాలుక‌ల ధోరణిని పాటిస్తున్నార‌ని రోజా ఫైర్ అయ్యారు. ప్రత్యేక హోదా రావడం చంద్రబాబుకు ఇష్టం లేదని రోజా దుమ్మెత్తి పోశారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.