రోజాకు తృటిలో త‌ప్పిన‌ పెను ప్ర‌మాదం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-29 15:47:30

రోజాకు తృటిలో త‌ప్పిన‌ పెను ప్ర‌మాదం

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ న‌గ‌రి ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ రోజా... నిరంత‌రం అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు చేస్తున్న అవినీతి అరాచ‌కాల‌ను ఎండ‌గ‌డుతూ వారికి కంటిమీద కునుకులేకుండా చేస్తుంటారు... తాను ఎమ్మెల్యేగా  బాధ్య‌త‌లు స్వీక‌రించిన‌ప్ప‌టి నుంచి అనుక్ష‌ణం ప్ర‌జ‌ల శ్రేయ‌స్సు కొసం కృషిచేస్తూనే ఉన్నారు రోజా.
 
అయితే ఈ రోజు  పార్టీకి సంబంధించిన ప‌నుల నిమిత్తం రోజా తిరుప‌తి విమానాశ్ర‌యం నుంచి శంషాబాద్  విమానాశ్ర‌యాని  9.40 చేరుకోవాలి...  అయితే ఆమె  ప్ర‌యాణిస్తున్న ఇండిగో విమానం శంషాబాద్ లో ల్యాండింగ్ అయ్యే స‌మ‌యంలో  టైరు పేలి మంట‌లు రావ‌డంతో ఆ నిప్పు ర‌వ్వ‌లు విమానానికి  అంటుకున్నాయి...  దీంతో ఈ మంట‌ల‌ను చూసి విమానంలో ప్ర‌యాణిస్తున్న ప్ర‌యాణికులంద‌రూ తాము చ‌నిపోతామ‌ని భావించారు.... అయితే అందులో ఉన్న పైలెట్ సిబ్బంది  అప్ర‌మ‌త్తం కావ‌డంతో పెను ప్ర‌మాదం త‌ప్పింది.
 
ఈ ప్రమాద ఘటనపై రోజా మాట్లాడుతూ... తిరుమల వెంకటేశ్వరస్వామి ఆశీస్సులతోనే పెను ప్రమాదం తృటిలో తప్పిందని అన్నారు.. తొలుత మంటలు కనిపించాయని, ఆ తర్వాత కాసేపటికే విమానం రన్‌వేపై ఆగిపోయిందన్నారు.మంటలు చుట్టుముట్టడంతో ఏం జరిగిందో అర్థం కాక అందరం భయపడ్డామని, తానైతే విమానం పేలిపోతుందేమోనని అనుకున్నానని పేర్కొన్నారు రోజా... మంటలు అదుపు చేశాక అరగంట వరకూ విమానం డోర్లు తెరవకపోవడంతో వణికిపోయినట్టు చెప్పారు.

షేర్ :

Comments

5 Comment

  1. Meeku emi kaadu, Tirupati venkanna swamy blessings Mee Pai vuntaye Roja garu

    GOD IS GREAT

    GOD IS GREAT

    fdfgfgfh

    fdfgfgfh

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.