ఎంత మంది ఉన్నామ‌న్న‌ది కాదు వ‌ణికించామా లేదా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

roja fires on chandrababu naidu
Updated:  2018-03-19 05:14:34

ఎంత మంది ఉన్నామ‌న్న‌ది కాదు వ‌ణికించామా లేదా

ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ న‌గ‌రి ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ రోజా  తెలుగు దేశం పార్టీ నాయ‌కుల‌ను నిరంత‌రం ప్ర‌శ్నిస్తూ వారికి కంటిమీద కునుకు లేకండా చేస్తుంటారు.. అయితే ఇప్ప‌టికే ఫైర్ బ్రాండ్ రోజా టీడీపీ నాయ‌కులు, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అధికార అండ‌తో అవినీతికి పాల్ప‌డుతున్నారంటూ అనేక సార్లు మీడియా ద్వారా తెలిపిన సంగ‌తి మ‌నంద‌రికీ తెలిసిందే...
 
అయితే తాజాగా పుత్తూరులో జ‌రిగిన ప్ర‌జాసంక‌ల్ప మాన‌వహారంలో రోజా పాల్గొన్నారు... ఈ సంద‌ర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా వ‌చ్చేంత వ‌ర‌కూ త‌మ పార్టీ ఎంపీలు కేంద్రంతో పోరాడుతూనే ఉంటార‌ని అన్నారు రోజా... ప్ర‌త్యేక హోదా అనేది ఒక ప్రాంతానికి సంబంధించిన‌ది కాద‌ని ఐదు కోట్ల‌మంది ప్ర‌జ‌ల శ్రేయ‌స్సు అని అన్నారు... రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కేంద్రంతో గట్టిగా పోరాటం చేసి ఉంటే రాష్ట్రం ఈ గ‌తికి చేరేదికాద‌ని అన్నారు.. ముఖ్య‌మంత్రికి చిత్త శుద్ది లేకపోవ‌డం వ‌ల్లే రాష్ట్ర ప్ర‌జ‌లు రోడ్డుమీద‌కు వ‌చ్చి పోరాటం చేయ‌వ‌ల‌సిని ప‌రిస్థితి వ‌చ్చింద‌ని రోజా స్ప‌ష్టం చేశారు
 
త‌మ పార్టీ నాయ‌కులు కేవ‌లం ఐదు మంది అయినా... కానీ ఐదు కోట్ల మంది ప్ర‌జ‌ల‌కోసం త‌మ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేరకు నిరంతరం కేంద్రంతో పోరాడుతూనే ఉన్నార‌ని రోజా తెలిపారు... ఎంత మంది ఉన్నాం అనేది పాయింట్ కాదని... పార్లమెంటును వణికించామా..? లేదా..? అనేదే ముఖ్యమని అన్నారు. ఎక్కువ సంఖ్యలో ఎంపీలు ఉన్నప్పటికీ... ఏ రోజు కూడా ప్రత్యేక హోదా కోసం  కృషి చేయని చంద్ర‌బాబు  ఇప్పుడు అవిశ్వాసం ద్వారా క్రెడిట్ కొట్టేయాలని ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు రోజా... 
 
అందులో భాగంగానే త‌మ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు ప్ర‌జ‌లు అడుగ‌డున బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నార‌ని అన్నారు... త‌మ నాయ‌కుడుకు తెలుపుతున్న మ‌ద్ద‌తును చూసి ముఖ్య‌మంత్రికి రోజూ రాత్రి పూట నిద్ర ప‌ట్ట‌డంలేద‌ని రోజా తెలిపారు... నాలుగు సంవ‌త్సరాలుగా చంద్ర‌బాబు రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీ నాయ‌కుల‌కు త‌గిన బుద్ది చెబుతార‌ని రోజా స్ప‌ష్టం చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.