నెక్ట్స్ అక్క‌డికే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-09 19:07:55

నెక్ట్స్ అక్క‌డికే

ఏపీ ప్ర‌తిప‌క్ష వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ రోజా ఎప్ప‌టిక‌ప్పుడు తెలుగుదేశం పార్టీ నాయ‌కులు చేస్తున్న అవినీతి అరాచ‌కాల‌ను ఎండ‌గ‌డుతూ, అధికార టీడీపీ నాయ‌కుల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంటారు రోజా. అయితే ఈ క్ర‌మంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుపై మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు ఆమె. ఓటుకు నోటు కేసులో చంద్ర‌బాబు త‌ప్ప‌కుండా జైలుకు వెళ్ల‌డం ఖాయం అని అన్నారు.
 
ఇక ఇప్ప‌టికే తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఈ కేసుకు సంబంధించిన ప‌నులు శ‌ర‌వేగంగా చేయిస్తున్నార‌ని ఆమె తెలిపారు. అయితే  ఈ ఓటుకు నోటు కేసు నుంచి త‌ప్పించుకునేందుకు చంద్ర‌బాబు అనేక ఎత్తుగ‌డ‌లు వేస్తున్నార‌ని రోజా మండిప‌డ్డారు. ఈ ఎత్తుగ‌డ‌ల్లో త‌న ప్రియ శిష్యుడు రేవంత్ రెడ్డిని కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేర్చార‌ని విమ‌ర్శించారు.  2019 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంద‌నే ముందు జాగ్ర‌త్తతో త‌న ప్రియ శిష్యుడిని కాంగ్రెస్ లో చేర్చార‌ని రోజా విమ‌ర్శించారు.
 
అలాగే చంద్ర‌బాబు నాయుడు దేశంలో త‌న‌కంటే సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడు లేర‌ని, మీడియా ద్వారా చెప్పుకుంటూ మురిసిపోతుంటార‌ని రోజా ఆరోపించారు.అయితే ఆయ‌న సీనియారిటీ కేవ‌లం ఆయ‌న‌ను కాపాడు కునేందుకు ఉప‌యోగప‌డుతోంది త‌ప్ప ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ఉప‌యోగం లేద‌నిస్ప‌ష్టం చేశారు. ఇదే అనుభ‌వంతోనే చంద్ర‌బాబు ఈ కేసు నుంచి బయటపడేందుకు విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన ప్రత్యేక హోదా, రైల్వేజోన్ ల‌ హామీల విష‌యంలో  కేంద్రానికి తాకట్టు పెట్టారని రోజా విమర్శలు చేశారు.
 
అలాగే చంద్ర‌బాబు నాయుడుకి అవ‌స‌రాల‌ను బ‌ట్టి ఇత‌ర పార్టీల‌తో పొత్తు పెట్టుకోవ‌డం అలవాటే అని రోజా అన్నారు. అయితే వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవ‌సరం లేద‌ని రోజా స్ప‌ష్టం చేశారు. ఏదైనా సాధించాలి అనుకుంటే త‌మ నాయ‌కుడు అది సాధించేంత వ‌ర‌కూ వ‌ద‌ల‌ర‌ని, ఉద్య‌మాలు చేయ‌డం జ‌గ‌న్ కు కొత్తేమి కాద‌ని త‌న తాత‌ల కాలం నుంచి ఉద్య‌మాలు చేస్తునే ఉన్నార‌ని రోజా అన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.