బాబుపై రోజా ఫైర్...

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ycp mla roja image
Updated:  2018-03-11 11:05:46

బాబుపై రోజా ఫైర్...

ఏపీ ప్ర‌తి ప‌క్షపార్టీ , వైసీపీ న‌గ‌రి ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ రోజా మ‌రోసారి మీడియాను వేదిక‌గా చేసుకుని ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర‌బాబుపై ఫైర్ అయ్యారు... 2014 ఎన్నిక‌ల ప్ర‌చారంలో బాబు అనేక హామీల‌ను ప్ర‌క‌టించార‌ని అయితే అవి ఒక్క‌టి కుడా నెర‌వేర్చ‌లేద‌ని అన్నారు రోజా.. దీంతో పాటు మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ, చ‌దువుకుంటున్న ప్ర‌తీ మ‌హిళ‌ల‌కు మొబైల్ ఫోన్, ట్యాబ్ ఇస్తామ‌ని అబ‌ద్ద‌పు ప్ర‌చారం చేసి అధికారాన్ని చేజిక్కించుకున్న బాబు, రాష్ట్రంలో ఒక్క‌రంటే ఒక్క‌రికి కూడా ట్యాబ్ ఇవ్వ‌లేద‌ని రోజా నిల‌దీశారు.
 
దీంతో పాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్ బ‌డ్జెట్  త‌న‌కు తీవ్ర నిరాశకు గురిచేసింది అని  అన్నారు రోజా... గ‌త బ‌డ్జెట్ లోనూ, ఈ బ‌డ్జెట్ లోనూ మ‌హిళ‌ల‌కు ప్ర‌వేశ పెట్టింది శూన్యం అని తెలిపారు...  మహిళల అక్రమ రవాణాలో రాష్ట్రం రెండో స్థానంలో ఉందని, చంద్రబాబు పాలనలో మహిళకు భద్రత కరువైందని ఆరోపించారు...అలాగే బాబు వ‌స్తే జాబ్ వ‌స్తుంద‌ని చెప్పి రాష్ట్రం మొత్తం మీద‌ త‌న కుమారుడు లోకేష్ బాబు మాత్ర‌మే జాబ్  ఇచ్చార‌ని రోజా మండిప‌డ్డారు రోజా..
 
అయితే ఇటీవ‌లే మ‌హిళా దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకున్న నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి చంద్రబాబు త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ లో ట్వీట్ చేశారు... మహిళా సాధికారతకు మా ఇళ్లే ఉదాహ‌ర‌ణ  అని సేవా రంగంలో 24 గంటలు నేను బిజీగా ఉంటాన‌ని.. వ్యాపారాన్ని నా భార్య సమర్థవంతంగా నిర్వర్తిస్తుంటార‌ని అన్నారు. అలాగే ఇప్పుడు మా కోడలు కూడా వ్యాపార బాధ్యతలు చూసుకుంటోందని, నేను మా అబ్బాయి ఆర్థికంగా వారి మీద ఆధారపడుతున్నామంటే అర్థం చేసుకోండి, వారి సమర్థత అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.. అయితే ఈ ట్వీట్ పై రోజా స్పందించారు... 
 
ముఖ్య‌మంత్రి తాను, త‌న కుటుంబం బాగుంటే చాలు రాష్ట్రంలో అంద‌రూ  బాగుంటార‌ని భావిస్తున్నార‌ని అన్నారు రోజా... ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలను పారిశ్రామికంగా ఎదిగేలా చేస్తామని, వ్యాపారస్తులుగా చేస్తామని చెప్పిన చంద్రబాబు.. నేడు తన ఇంట్లోని ఇద్దరు మహిళలను బినామీ డబ్బుతో పారిశ్రామికంగా ఎదిగేలా చేశారని అన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.