ధైర్యంలేని బాబు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ycp mla roja
Updated:  2018-04-09 05:14:26

ధైర్యంలేని బాబు

ప్ర‌తిప‌క్ష‌ వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్, న‌గ‌రి ఎమ్మెల్యే రోజా నిత్యం అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు చేస్తున్న అవినీతి అరాచ‌కాల‌ను అనుక్ష‌ణం ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ టీడీపీ నాయ‌కుల‌కు కంటిమీద కునుకులేకుండా చేస్తుంటారు....
 
ఈ క్ర‌మంలో మ‌రోసారి ఢిల్లీలోని ఏపీ భ‌వ‌న్ లో వైసీపీ ఎంపీలు చేస్తున్న  ఆమ‌ర‌ణ నిరిహార  దీక్ష‌లో పాల్గొని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై మండిప‌డ్డారు... ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ..త‌మ పార్టీ ఎంపీలు రాజీనామా చేసిన‌ప్పుడే చంద్ర‌బాబు వారి ఎంపీల‌తో రాజీనామా చేయించి వుంటే రాష్ట్రానికి ఇంత‌గ‌తి ప‌ట్టి ఉండేది కాద‌ని రోజా ఆరోపించారు.
 
ప్ర‌త్యేక‌ హోదా కోసం వైసీపీ నాయ‌కులు అలుపెరుగ‌ని స‌మ‌ర ధీక్ష చేస్తుంటే అధికార తెలుగుదేశం నాయ‌కులు మాత్రం చీమ కుట్టిన‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నారని రోజా అన్నారు ... అలాగే ఈ రోజు కూడా ప్రత్యేక హోదా సాధన పేరుతో టీడీపీ నాయ‌కులు నాట‌కాలు ఆడుతున్నార‌ని, మెరుపు ఆందోళన పేరుతో ప్రధాని మోదీ ఇంటి వ‌రకూ వెళ్లి వారంతట వారే అరెస్ట్ అయి డ్రామాలు ఆడుతున్నారని రోజా ఆరోపించారు..త‌న పార్టీ ఎంపీలతో రాజీనామాలు చేయించి కేంద్రంపై ఒత్తిడి తెచ్చే దమ్మూ, ధైర్యం చంద్రబాబుకు లేవా అని ప్రశ్నించారు.
 
పార్లమెంట్ సాక్షిగా కేంద్రం ప్ర‌క‌టించిన‌ హామీలను వెంట‌నే అమలు చేయాలని తాము డిమాండ్ చేస్తూ, పదవులను వదులుకుంటుంటే, టీడీపీ అయితే ప్రజల పక్షాన్ని వదిలేసి పదవులను పట్టుకు వేలాడుతోందని రోజా ఆరోపించారు. కాగా ముఖ్య‌మంత్రి చిత్త శుద్దివ‌ల్లే రాష్ట్రానికి ఈ గ‌తి ప‌ట్టింద‌ని, వారు చేస్తున్న మోసాల‌ను అనుక్ష‌ణం ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని అన్నారు... వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు ప్ర‌జ‌లు త‌గిన గుణ‌పాఠం చెబుతార‌ని రోజా ఫైర్ అయ్యారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.