బాబు పై రోజా ఫైర్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ycp mla roja
Updated:  2018-07-23 05:53:51

బాబు పై రోజా ఫైర్

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌తిపక్షనేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రి అవ్వ‌డం ఖాయం అని ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా స్ప‌ష్టం చేశారు. ఈ రోజు చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆమె మాట్లాడుతూ, త‌మ పార్టీ అధినేత జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర‌కు ప్ర‌జ‌లు తెలుపుతున్న మ‌ద్ద‌తును చూసి అధికార తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకి అలాగే టీడీపీ నాయ‌కులకు కంటిమీద నిద్ర క‌రువు అయింద‌ని రోజా ఆరోపించారు.
 
గ‌త ఎన్నికల్లో చంద్ర‌బాబు నాయుడు సుమారు ఆరువంద‌ల‌కు పైగా త‌ప్పుడు హామీల‌ను ప్ర‌క‌టించి అధికారంలోకి వ‌చ్చార‌ని అయితే 2019 ఎన్నిక‌ల్లో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు వెయ్యి హామీల‌ను ప్ర‌క‌టించినా టీడీపీని ప్ర‌జ‌లు న‌మ్మ‌ర‌ని రోజా స్ప‌ష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చంద్ర‌బాబు నాయుడు జ‌న్మ భూమి క‌మిటీ పేరుతో ప్ర‌జా ధ‌నాన్ని అక్ర‌మంగా దోచుకుంటున్నార‌ని ఆమె ఆరోపించారు. అధికార బ‌లంతో చంద్ర‌బాబు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో ప్ర‌తిప‌క్ష నాయ‌కులపై క‌క్ష సాధింపు రాజ‌కీయాలు చేస్తున్నార‌ని రోజా ఫైర్ అయ్యారు.
 
పార్ల‌మెంట్ లో అవిశ్వాసంపై జ‌రిగిన చ‌ర్చ‌లో టీడీపీ ఎంపీలు విఫ‌లం అయ్యార‌ని అందుకే తమ పార్టీ నాయ‌కుడు రేపు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు పిలుపునిచ్చార‌ని ఆమె తెలిపారు. గ‌త ఎన్నిక‌ల్లో వైఎస్ జ‌గ‌న్ న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో త‌న‌ను న‌మ్మి టికెట్ ఇచ్చార‌ని ఆయ‌న న‌మ్మ‌కాన్ని వమ్ము చెయ్య‌కుండా కాపాడ‌ట‌మే త‌న క‌ర్త‌వ్యం అని రోజా స్ప‌ష్టం చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.