నాప్రాణం ఉన్నంత వ‌ర‌కూ వారికోసం పోరాడుతా రోజా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-31 18:33:08

నాప్రాణం ఉన్నంత వ‌ర‌కూ వారికోసం పోరాడుతా రోజా

అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కుల‌కు చెందిన ఓ టిప్ప‌ర్ లారీ ఢీ కొని మ‌హిళ చ‌నిపోతే తాను స్పందించినందుకు, అలాగే త‌ప్పు చేసిన సీఐని నిల‌దీసినందుకు త‌న‌పై అక్ర‌మ కేసులు పెట్టార‌ని ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  ఫైర్ బ్రాండ్, చిత్తూరు జిల్లా న‌గ‌రి ఎమ్మెల్యే రోజా మండిప‌డ్డారు.
 
ఈ రోజు తిరుప‌తి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆమె మాట్లాడ‌తుతూ, అధికార బలంతో టీడీపీ నాయ‌కులు క్వారీల‌ను న‌డిపించుకుంటున్నార‌ని ఆమె మండిప‌డ్డారు. ఈ క్వారీలో బాంబ్ బ్లాస్టింగ్ నిర్వ‌హించ‌డం వల్ల అనేక గ్రామాలు బీట‌లు వాలుతున్నాయ‌ని, ఈ సౌండ్ వ‌ల్ల చాలా మంది పిల్ల‌ల‌కు చెవుడు వ‌చ్చిందని రోజా ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 
 
అయితే తాను న‌గ‌రి ఎమ్మెల్యేగా త‌న నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రుగుతున్న ఈ అక్ర‌మాల‌పై అనేక సార్లు జిల్లా క‌లెక్ట‌ర్ కు ఫిర్యాదు చేశాన‌ని స్ప‌ష్టం చేశారు. ఈ వ్య‌వహ‌రంపై క‌లెక్ట‌ర్ స్పందించి త‌హ‌శిల్దార్ కు చెబితే ఆయ‌న ప‌ట్టించుకోవ‌డం లేద‌ని రోజా మండిప‌డ్డారు.
 
ఈ త‌హ‌శిల్దారు టీడీపీ నాయ‌కులు ఇక్క‌డకు ట్రాన్స్ ఫ‌ర్ చేసుకుని ఇసుక మాఫియా రేష‌న్ బియ్యం త‌ర‌లించ‌డానికి, అలాగే అక్ర‌మ క్వారీల‌కు అండగా ఉంటున్నార‌ని రోజా ఆరోపించారు. క్వారీ టిప్ప‌ర్లు మున్సిపాలిటీలో తిర‌గటం వ‌ల్ల గ్రామ ప్ర‌జ‌ల‌కు ప్రాణ హానీ ఉంది హెవీలోడ్ వ‌ల్ల ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నారు వీటిని మూసివెయ్యాల‌ని తాము మాట్లాడితే పోలీసుల‌ను తిట్టామ‌ని ఒక కేసు, ట్రాఫిక్ జామ్ చేశామ‌ని ఒక కేసు, శవాన్ని తీసుకు వ‌చ్చామ‌ని ఒక కేసులు హెడ్ కానిస్టెబుల్ చేత పెట్టించార‌ని రోజా విమ‌ర్శ‌లు చేశారు.
 
తాను ప్ర‌జా ప్ర‌తినిధిగా ఒక మ‌హిళ‌గా న‌గ‌రిలో టిప్పర్ ఢీ కొట్టి చ‌నిపోతే దీనికి వ్య‌తిరేకంగా పోరాటం చేసినందుకు అక్ర‌మ కేసులు పెట్టార‌ని రోజా మండిప‌డ్డారు. పోలీస్ అధికారులు టీడీపీ నాయ‌కులు అండ‌గా నిల‌వ‌డం వ‌ల్ల న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో లాండార్డ‌ర్ ప్ర‌కారం ఏ ప్ర‌భుత్వ అధికారులు న‌డుచుకోవ‌డం లేద‌ని రోజా ఆరోపించారు. అయితే త‌న‌మీద ఎన్నికేసులు పెట్టినా భ‌య‌ప‌డ‌న‌ని రాష్ట్రంలో మ‌హిళ‌ల‌కు అన్యాయం జ‌రిగితే స‌హించేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. మ‌హిళ‌ల కోసం త‌న తుది శ్వాస ఉన్నంత వ‌ర‌కు పోరాటం చేస్తాన‌ని ఆమె అన్నారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.