జ‌గ‌న్ ఎప్పుడో చెప్పారు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-19 01:20:11

జ‌గ‌న్ ఎప్పుడో చెప్పారు

రాష్ట్ర ప్ర‌జ‌ల‌ ప్ర‌యోజ‌నాల‌ను గాలికి వ‌దిలేసి స్వ‌ప్ర‌యోజ‌నాల కోసం త‌హ‌త‌హ‌లాడుతున్నారంటూ  టీడీపీ నేత‌లపై వైసీపీ ఎమ్మెల్యే రోజా  తీవ్రంగా మండిప‌డ్డారు. చిత్తూరు జిల్లా కలెక్టర్‌ బంగ్లాలో  ఏర్పాటు చేసిన విలేకరుల స‌మావేశంలో రోజా  మాట్లాడారు.
 
కేంద్రం ప్ర‌వేశపెట్టిన‌ బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జ‌రిగిందంటూ అన్ని పార్టీలు పోరాటం చేస్తే, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు 17 రోజులు త‌ర్వాత బ‌య‌టికి వ‌చ్చి రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం రాజీప‌డ‌కుండా పోరాటం చేస్తామ‌ని చెప్ప‌డం హ‌స్యాస్ప‌దంగా ఉంద‌ని రోజా అన్నారు. ఎన్‌డీఏ ప్ర‌భుత్వం ఏపీని చుల‌క‌న‌గా చూస్తూ ... మోసం చేస్తున్నా... మిత్ర‌ప‌క్షం నుంచి వైదొలుగుతామ‌ని ఎందుకు చెప్ప‌లేకపోతున్నార‌ని రోజా టీడీపీ నేత‌ల‌ను ప్ర‌శ్నించారు.
 
ప్ర‌త్యేకహోదా రాక‌పోతే రాష్ట్రం అభివృద్ది చెంద‌ద‌ని  త‌మ నాయ‌కుడు వైయ‌స్ జ‌గ‌న్ గ‌తంలోనే చెప్పిన విష‌యాన్ని  గుర్తు చేశారు రోజా. హోదా ప్ర‌క‌టించ‌క‌పోతే రాజీనామాలు చేయాల‌న్న ప‌వ‌న్....నేడు అవిశ్వాస తీర్మానం పెట్టాలని చెప్ప‌డం విడ్డూరంగా ఉంద‌ని ఎమ్మెల్యే రోజా తెలిపారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.