రోజా నోటికే కాదు చేతుల‌కు ప‌ని చెప్పారు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-22 17:00:17

రోజా నోటికే కాదు చేతుల‌కు ప‌ని చెప్పారు

కొద్ది కాలంగా కేర‌ళ‌లో ఎడ‌తెరుపు లేకుండా కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు అక్క‌డి ప్ర‌జ‌లు అతాలా కుత‌లం అవుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ వ‌ర్షాల్లో చిక్కుకున్న ప్ర‌జ‌లకు ప్ర‌తిపక్ష‌నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌హాయం చెయ్యాల‌ని రాష్ట్ర ప్ర‌జ‌లకు పార్టీ నాయ‌కులకు పిలుపునిచ్చారు. 
 
ఈ మేర‌కు వైసీపీ న‌గ‌రి ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ రోజా త‌న నోటికే కాదు ఆప‌ద‌లో ఉన్న వారికి  త‌న చేతుల‌తో స‌హాయం చేయడంలో కూడా పెద్ద మ‌న‌సు. అందుకే త‌న వంతు స‌హాయంగా కేర‌ళ వాసుల‌కు 10 లక్ష‌ల న‌గ‌దు, 14 ట‌న్నుల‌ రేష‌న్ బియ్య‌ము, కందిప‌ప్పు, వంట‌కు స‌రిప‌డ వ‌స్తువుల‌ను, అలాగే మ‌హిళ‌ల‌కు చీర‌ల‌ను స‌హాయం చేశారు. 
 
అంతేకాదు త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌తీ ఒక్క‌రు స్వ‌చ్చందంగా కేర‌ళ బాధితుల‌కు స‌హాయం చెయ్యాల‌ని రోజా పిలుపునిచ్చారు. కాగా ఇప్ప‌టికే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పార్టీ త‌ర‌పున కోటి రూపాయ‌ల‌ను కేర‌ళ వ‌ర‌ద బాధితుల‌కు ముఖ్య‌మంత్రి ఫండ్ కింద పంపించిన సంగ‌తి తెలిసిందే.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.