ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ రోజా ఎప్పటికప్పుడు అధికార తెలుగు దేశం పార్టీ నాయకులు చేస్తున్న అవినీతి అరాచకాలను ఎండగడుతూ వారికి కంటి మీద కునుకులేకుండా చేస్తుంటారు...అయితే ప్రత్యేక హూదా పోరు నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై, ఆయన కుమారుడు లోకేశ్ పై ఆమె ఫైర్ అయ్యారు..
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ ఎంపీలు పదవులను ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నిరాహార దీక్ష చేస్తుంటే ముఖ్యమంత్రి అమరావతిలో భజన చేస్తున్నారని రోజా మండిపడ్డారు... కుంభకర్ణుడుకైనా ప్రతీ ఆరునెలలకు ఒకసారి మెలకువ వస్తుందని, కానీ చంద్రబాబుకు మాత్రం నాలుగు సంవత్సరాలు గడిచినా మెలకువ రాకుందని ఫైర్ అయ్యారు రోజా.. దేశంలో ఏ రాజకీయ నాయకుడు చేయలేని నీచమైన రాజకీయాలు చంద్రబాబు చేస్తున్నారని రోజా మండిపడ్డారు.
దీంతోపాటు మంత్రి నారా లోకేశ్ విశ్వ విఖ్యాత పప్పు సార్వభౌమ అంటూ ఎద్దేవా చేశారు.. ఓటేసిన ప్రజలు ఆయన దగ్గరకు ఏమైనా సమస్యలు చెప్పుకోవడానికి వెళితే పనులు జరగవని, పనుల కోసం డబ్బు ఇస్తేనే పప్పు సంతకాలు పెడతారని విమర్శించారు..
గత ఎన్నికల ప్రచారంలో మహిళలకు, నిరుద్యోగులకు అనేక హామీలు ప్రకటించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అవి తుంగలో తొక్కేశారని అన్నారు.. అలాగే రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల మీద దాడులు జరుగుతున్నాయని, చంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్‌ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చారని, ఎక్కడ చూసినా మద్యం ఏరులై పారుతోందని అన్నారు.
నాడు సమైఖ్యాంద్ర ఉద్యమంలో భాగంగా నందమూరి హరికృష్ణతో రాజీనామా చేయించిన చంద్రబాబు.. ఇవాళ తన బినామీ సుజనా చౌదరితో ఎందుకు చేయించలేదు? భోఫోర్స్ కుంభకోణం సమయంలో ఎన్టీఆర్ లోక్‌సభ ఎంపీల చేత రాజీనామా చేయించారే ఆ సమయంలో టీడీపీ రాజ్యసభ ఎంపీలతో ఎందుకు రాజీనామా చేయించలేదని ప్రశ్నించారు. ఆరోజు ఎన్టీఆర్ పక్కన ఉన్న చంద్రబాబు దీనికి సమాధానం చెబుతారా అని ప్రశ్నించారు ఆమె.. అసలు వైసీపీ సభ్యులను రాజీనామా చేయించాలి అని కోరుతున్న చంద్రబాబుకి సిగ్గుందా అని ఆమె అన్నారు.
Comments