వైసీపీ ఎమ్మెల్యే సుడిగాలి పర్య‌ట‌న‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-20 18:38:52

వైసీపీ ఎమ్మెల్యే సుడిగాలి పర్య‌ట‌న‌

ఏపీ ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాయ‌చోటి ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ శ్రీకాంత్ రెడ్డి రాయ‌చోటిలో స‌డిగాలి ప‌ర్య‌ట‌న చేసి ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటున్నారు. అంతేకాదు మురుకి కాలువల్లో పూడిక తీయించాలని, సిమెంట్ రోడ్లు నిర్మించాలని, వీధిలైట్లు ఏర్పాటు చేయించాలంటూ ప్ర‌జ‌లు శ్రీకాంత్ రెడ్డికి సుచించారు. ఇక వారి స‌మ‌స్య‌ల‌ను విన్న ఆయ‌న త్వ‌ర‌లో వీట‌న్నింటికి ప‌రిష్కారం చేయిస్తాన‌ని హామీ ఇచ్చారు.
 
అంతేకాదు పెమ్మాడపల్లె రహదారి ఆక్రమణకు గురైందంటూ స్థానిక ప్రజలు శ్రీకాంత్ రెడ్డి దృష్టికి తీసుకురాగా వాటిపై వెంట‌నే చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇక ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా  గ్రామంలో ఉన్న పాఠ‌శాల‌ను సంద‌ర్శించి గదుల కొరత, ఉపాధ్యాయుల కొరత ఉందని ఈ విష‌యాన్ని తాను ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.     
 
ఈ సంద‌ర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయ‌న సూచించారు. మురికి కాలువలలో  పూడుకు పోయిన మట్టిని త్వరితగతిన తొలగించాలని ఆయన స్ప‌ష్టం చేశారు.  కొన్ని మురికి కాలువల్లో చెత్త పేరుకుపోయింద‌ని, ఇలా ఉంటే  సహించనని ఆయన హెచ్చరించ