రాజీనామాల‌కు సై అంటున్న వైసీపీ ఎమ్మెల్యే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-21 13:19:18

రాజీనామాల‌కు సై అంటున్న వైసీపీ ఎమ్మెల్యే

క‌డ‌ప ఉక్కు రాయ‌ల‌సీమ హక్కు అని నాలుగు సంవ‌త్స‌రాలుగా ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు పోరాటాలు చేస్తూనే ఉన్నార‌ని రాయ‌చోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. గ‌తంలో తాము క‌డ‌ప ఉక్కు కోసం పోరాటం ఉదృతం చేసిన‌ప్పుడు అధికార‌ తెలుగుదేశం పార్టీ నాయ‌కులు త‌మ‌పై అక్ర‌మంగా కేసులు పెట్టార‌ని గుర్తు చేశారు. మొద‌టి నుంచి పోరాటం చేయ‌లేని టీడీపీ నాయ‌కులు ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కోసం దీక్ష‌లు చేస్తే ప్ర‌జ‌లు ఎవ్వ‌రు న‌మ్మ‌రని శ్రీ కాంత్ రెడ్డి తెలిపారు.
 
టీడీపీ నాయ‌కులు చేసేది ఉక్కు దీక్ష కాదని పార్టీ ఇమేజ్‌ కోసం ఏర్పాటు చేసిన ఈవెంట్‌ అని ఎద్దేవా చేశారు.  2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌రకు వ‌స్తున్న నేప‌థ్యంలో ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టే కార్య‌క్ర‌మాలు చేస్తున్నార‌ని శ్రీకాంత్ రెడ్డి మండిప‌డ్డారు. వారు ఎన్ని దీక్ష‌లు చేసినా కూడా ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు ల‌భించ‌ద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. నాలుగు సంవ‌త్స‌రాలుగా వైసీపీ నాయ‌కులు విభజ‌న అంశాల‌పై, అలాగే క‌డ‌ప స్టీల్ ప్లాంట్ సాధ‌న కోసం తాము చిత్తశుద్దితో ప‌ని చేస్తున్నామ‌ని శ్రీకాంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.. అవ‌స‌ర‌మైత తాము ఉక్కు ప‌రిశ్ర‌మ కోసం రాజీనామాల‌కు సిద్ద‌మ‌ని  పేర్కొన్నారు.
 
2014 ఎన్నిక‌ల‌ ప్ర‌చారంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు క‌డ‌ప‌ను టీహ‌బ్ చేస్తాన‌ని, హర్టిక‌ల్ క‌ల్చ‌ర్ హాబ్ చేస్తాన‌ని త‌ప్పుడు వాగ్దానాలు చెప్పి అధికారంలోకి వ‌చ్చార‌ని శ్రీకాంత్ రెడ్డి మండిప‌డ్డారు. టీడీపీ అధికారంలోకి వ‌చ్చి నాలుగు సంవ‌త్స‌రాలు పూర్తి అయినా కూడా జిల్లాలో ఒక్క ప‌నిని కూడా నెర‌వేర్చ‌లేకపోయార‌ని ఆయ‌న పేర్కొన్నారు. రాయలసీమ అభివృద్ధిపై టీడీపీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఉక్కు పరిశ్రమ, హైకోర్టుతో పాటు రెండో రాజధానిని ఇక్కడ నిర్మించాలని ఎమ్మెల్యే సవాల్‌ విసిరారు.
 
మాజీ ముఖ్య‌మంత్రి దివంగ‌త‌నేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి హ‌యాంలో క‌డ‌ప ఉక్కు ప‌రిశ్ర‌మ కోసం సుమారు రెండు వేల కోట్లు ఖర్చు చేశార‌ని గుర్తు చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా ఆయ‌న ఎవ‌రిపై ఆధార‌ప‌డ‌కుండా ధృడ‌సంక‌ల్పంతో ఉక్కు ప‌రిశ్ర‌మ స్థాపించార‌ని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. అయితే ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మాత్రం నాలుగేళ్లలో ఒక్క పరిశ్రమను కూడా ఏర్పాటు చేయలేదని విమర్శించారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.