బాబు భార్య‌కు 12 వంద‌ల కోట్ల ఆస్తులు ఎక్క‌డి నుంచి వ‌చ్చాయి వైసీపీ ఎమ్మెల్యే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababunaidu and bhuvaneswari
Updated:  2018-09-26 02:52:25

బాబు భార్య‌కు 12 వంద‌ల కోట్ల ఆస్తులు ఎక్క‌డి నుంచి వ‌చ్చాయి వైసీపీ ఎమ్మెల్యే

అమెరికా ఐక్య‌రాజ్య స‌మితిలో ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ప్ర‌కృతి సేద్యంపై తప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాయ‌చోటి ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ శ్రీకాంత్ రెడ్డి మండిప‌డ్డారు. ఈ రోజు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ ఏపీలో 2 కోట్ల ఎక‌రాల్లో ప్ర‌కృతి సేద్యం జ‌రుగుతుంద‌ని ఐక్య‌రాజ‌క్య‌స‌మితిలో త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని ఆయ‌న తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. 
 
గతంలో చంద్ర‌బాబు నాయుడు వ్య‌వ‌సాయాన్ని స‌ర్వ‌నాశ‌నం చేసిన‌టువంటి వ్య‌క్తి , వ్య‌వ‌సాయం దండ‌గా, రైతులు అంటే త‌న‌కు గిట్ట‌న‌టువంటి, వ్య‌క్తి వ్య‌వ‌సాయం గురించి మాట్లాడ‌డం దారుణం అని శ్రీకాంత్ రెడ్డి మండిప‌డ్డారు. నిజంగా చంద్ర‌బాబు నాయుడు విదేశాల్లో ఏపీ గురించి మాట్లాగితే తాము సంతోషిస్తామ‌ని, రాష్ట్రంలో చంద్ర‌బాబు నాయుడు ప్ర‌జ‌లకు మంచి చేసి ఉంటే తాము నిజంగా సంతోషించేవార‌మని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. 
 
2014లో అధికారంలోకి వ‌చ్చిన చంద్ర‌బాబు రైతుల‌కు రుణ‌మాఫీ చెయ్య‌కుండా మోసం చేశారని, అబ‌ద్దాలు చెప్ప‌డంలో చంద్ర‌బాబుది ప్ర‌పంచ‌ఖ్యాతి అని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. వైఎస్ హయాంలో ప్రాజెక్టులు ప‌రుగులు తీస్తే చంద్ర‌బాబు హయాంలో ప్రాజెక్టుల‌ను నీరు గార్చార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. 
 
అంతేకాదు చంద్ర‌బాబు నాయుడు అనుకూల‌ మీడియాలతో తానే ప్రాజెక్టుల‌ను క‌ట్టిన‌ట్లు ప్ర‌చారం చేయించు కుంటున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. కోటీశ్వ‌రుల జాబితాలో నారా భువ‌నేశ్వ‌రి పేరిట 12 వంద‌ల‌కోట్ల ఆస్తులు ఉన్నాయ‌ని ఇన్నికోట్ల ఆస్తులు చంద్ర‌బాబుకు ఎలా వ‌చ్చాయ‌ని శ్రీకాంత్ రెడ్డి ప్ర‌శ్నించారు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.