త‌న మ‌న‌సులో మాట చెప్పిన వైసీపీ ఎమ్మెల్యే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-27 18:40:47

త‌న మ‌న‌సులో మాట చెప్పిన వైసీపీ ఎమ్మెల్యే

ప్ర‌తిపక్ష‌నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డిని చూస్తుంటే వైసీపీ ఎమ్మెల్యేలు అయిన త‌మ‌కు చాలా గర్వం గా ఉందని రాయ‌చోటి ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఈ రోజు తూర్పు గోదావ‌రి జిల్లా అమ‌లాపురంలో జ‌గ‌న్ పాద‌యాత్ర చేస్తున్న ప్రాంతానికి ఆయ‌న చేరుకుని గంట‌సేపు పాద‌యాత్ర చేశారు. 
 
ఆ త‌ర్వాత ఆయ‌న మీడియాతో మాట్లాడాతూ, 200 రోజులు పాదయాత్ర చేయడమంటే సామాన్య విషయం కాదని శ్రీకాంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. దేశంలో ఏ నాయ‌కుడు చేయ‌లేని విధంగా జ‌గ‌న్ పాద‌యాత్ర చేస్తున్నార‌ని శ్రీకాంత్ రెడ్డి హ‌ర్షం వ్య‌క్తం చేశారు.
 
ఈ పాద‌యాత్ర‌లో త‌న‌కు జ‌గ‌న్ ఆర్భాటాలకు దూరంగా ఉండాల‌ని సూచించార‌ని తెలిపారు. ప్ర‌తీ చోట‌ మొక్కలు నాటమ‌ని వైఎస్ జగన్ త‌న‌కు పిలుపునిచ్చారని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ప్రజా సంకల్పయాత్ర  దిగ్విజయంగా కొనసాగుతోందన్నారు. ప్రజల ఆశీస్సులు, అలాగే దేవుడి దీవెన‌లు జగన్ కు నిరంత‌రం ఉంటాయ‌ని ఆయన స్ప‌ష్టం చేశారు. అలాగే త్వరలో రాజన్న రాజ్యం రాబోతుందని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి త‌న మ‌న‌సులో మాట చెప్పారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.