బాబు పరువు తీసిన శ్రీకాంత్ రెడ్డి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ycp mla srikanth reddy fires on chandrababu naidu
Updated:  2018-02-23 06:03:30

బాబు పరువు తీసిన శ్రీకాంత్ రెడ్డి

ఇంత‌న్నాడంత‌న్నాడో బాబుగారు ఏపికి పెట్టుబ‌డులు అన్నారో, అని దండోరా వినిపించేది ఆస్ధాన‌మీడియాల్లో... క‌ల‌మే క‌దా అని విపులంగా ల‌చ్చ‌ల కోట్ల రూపాయ‌లు ఏపీకి వ‌స్తున్నాయి అని పేప‌ర్ల‌లో పుంకాలు పుంకాలు ప్ర‌చురించారు.. వీరి ఐదు రూపాయ‌ల పేప‌ర్ ఖ‌రీదు ఎలా ఉన్నా, ఏపీకి మాత్రం అర‌గుండు కొట్టేశారు.. విశాఖ‌లో 25 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డులు, దావోస్ లో 10 ల‌క్ష‌ల కోట్ల  రూపాయ‌ల పెట్టుబ‌డులు అంటూ ఊద‌ర‌కొట్టారు.. చివ‌ర‌కు పావ‌లా కూడా రాలేదు..
 
ఇవ‌న్ని ఏపీకి వ‌స్తున్నాయి కాబ‌ట్టి మ‌నం ఏపీకి ఎటువంటి సాయం చేయ‌క్క‌ర్లేదు అని కేంద్రం చ‌ల్లాగా కూర్చుంది.. ఇప్పుడు మాకు కేంద్రం ఏమీ చేయ‌లేదు అని తెలుగుదేశం గ‌ళం విప్పుతోంది. ప్ర‌త్యేక హూదా సంజీవ‌నా అన్న నాయ‌కులు నేడు అదే  కావాలి అని కోరుతున్నారు.... ఇప్పుడు వీరికి ఆ ప్ర‌త్యేక హూదా సోయ తెలిసివ‌చ్చిన‌ట్టు ఉంది.
 
రాష్ట్రాన్ని అవినీతిమ‌యం చేసి, పెట్టుబ‌డులు పెట్ట‌డానికి వ‌చ్చిన వారిపై  నిర్లక్ష్య వైఖ‌రి చూపి.. రాష్ట్ర ప‌రువుని అంత‌ర్జాతీయ స్ధాయిలో తీసేశార‌ని వైసీపీ నాయ‌కులు తెలుగుదేశం పై విమ‌ర్శ‌లు చేశారు... బాబు స్వ‌ప్ర‌యోజ‌నాల కోసం రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను తాక‌ట్టుపెట్టార‌ని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి విమ‌ర్శించారు....రాజ‌ధాని భూముల‌తో రియ‌ల్ ఎస్టేట్  వ్యాపారం చేస్తూ కోట్ల రుపాయ‌లు సంపాదించే ప‌నిలో తెలుగుదేశం నాయ‌కులు నిమ‌గ్నం అయ్యార‌ని విమ‌ర్శించారు శ్రీకాంత్ రెడ్డి... సిఎం చంద్ర‌బాబు విధానాల వ‌ల్లే రాష్ట్రం న‌ష్ట‌పోతోంద‌న్నారు ఆయ‌న‌.
 
ప్ర‌త్యేక హోదా, ప్ర‌త్యేక ప్యాకేజీ  సాధించ‌డంలో తెలుగుదేశం స‌ర్కార్ ఘోరంగా విఫ‌లం అయింద‌ని అన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి రాష్ట్ర అభివృద్దిని ప్ర‌ధాని మోదీ కాళ్ల‌కు తాక‌ట్టుపెట్టార‌ని విమ‌ర్శించారు...రాష్ట్ర అభివృద్దిని, ప్ర‌యోజ‌నాల‌ను దృష్టిలో ఉంచుకునే మా నాయ‌కుడు, వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నిత్యం పోరాటం చేస్తున్నార‌ని ఆయ‌న తెలియ‌చేశారు. మీరు చూపించిన నిర్ల‌క్ష్య వైఖ‌రి వ‌ల్ల జ‌పాన్ కంపెనీ మీ బండారం ఎలా బ‌య‌ట‌పెట్టిందో ఓసారి తెలుసుకోండి అని ఆయ‌న విమ‌ర్శించారు... రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం ప్ర‌తిప‌క్షంతో ఒక్క‌సారి అయినా మాట్లాడారా అని ఆయ‌న నిల‌దీశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.