చంద్ర‌బాబు పై శ్రీకాంత్ రెడ్డి ఫైర్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

srikanth reddy and babu
Updated:  2018-10-27 03:50:19

చంద్ర‌బాబు పై శ్రీకాంత్ రెడ్డి ఫైర్

ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పై జ‌రిగిన హ‌త్యాయ‌త్నంపై అధికార  చంద్ర‌బాబు నాయుడు చేసిన వ్యాఖ్య‌ల‌పై వైసీపీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ శ్రీకాంత్ రెడ్డి త‌ప్పుబ‌ట్టారు. తాజాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ చంద్ర‌బాబు నాయుడు ముఖ్య‌మంత్రి స్థాయిలో ఉన్న వ్య‌క్తి  ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌నేత జ‌గ‌న్ పై దాడి జ‌రిగితే ఇందుకు వ్య‌తిరేకంగా స్పందించేది పోయి ఇష్టాను సారంగా  మాట్లుడుతున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు.
 
చంద్ర‌బాబు మాట్లాడిన మాట‌లు ఆయ‌న విజ్ఞ‌త‌కే వ‌దిలేస్తున్నామ‌ని అన్నారు . అయితే తాము టీడీపీ నాయ‌కుల్లా దిగ‌జారుడు వ్యాఖ్య‌లు చేయ‌మ‌ని విలువ‌ల‌తో కూడిన రాజ‌కీయం చేస్తామ‌ని శ్రీకాంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.  గ‌తంలో చంద్ర‌బాబు నాయుడుపై అలిపిరిలో బాంబ్ బ్లాస్ట్ జ‌రిగితే అప్పుడు ప్ర‌తిప‌క్షంలో ఉన్న వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి స్పందించి తిరుప‌తిలో దాడికి వ్య‌తిరేకంగా నిర‌స‌న‌లు చేశార‌ని గుర్తు చేశారు.
 
అయితే ఇప్పుడు జ‌గ‌న్ దాడిపై చంద్ర‌బాబు స్పందించిన తీరు బాధాక‌రంగా ఉంద‌ని అన్నారు. ఈ దాడి విష‌యంలో మేధావులు, ప్ర‌జ‌లు రాజ‌కీయ విశ్లేష‌కులు అర్థం చేసుకోవాల‌ని అన్నారు. గ‌తంలో తాను ఆప‌రేష‌న్ గ‌రుడ పేరును ప్ర‌స్తావిస్తూ ఆప‌రేష‌న్ పెరుగు వ‌డ అప్ప‌డం అని అన్నాన‌ని కాని ఇప్పుడు దాని గురించి పూర్తిగా అర్థం అవుతు