మీడియా ముందుకు వచ్చి చెప్పమనండి?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-16 16:10:36

మీడియా ముందుకు వచ్చి చెప్పమనండి?

జగన్ కి రైట్ హ్యాండ్ గా, మొదటి నుండి జగన్ వెన్నంటి నడిచిన నాయకుడు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. తన వాక్చాతుర్యంతో రాష్ట్రం మొత్తం అభిమానులను సంపాదించుకున్నారు. శ్రీకాంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెడితే అయన ఏం మాట్లాడతారో, ఎలాంటి పేర్లు బ‌య‌ట పెడతారో అని భయపడతారు టీడీపీ నాయకులు. జేసీ దివాకర్ రెడ్డికి జానీవాకర్ అని పేరు పెట్టింది కూడా శ్రీకాంత్ రెడ్డే.
 
అయితే శ్రీకాంత్ రెడ్డిపై బురద జల్లడానికి టీడీపీ సోషల్ మీడియా చేసిన ప్రయత్నం అంతా ఇంత కాదు...ఆయన పార్టీ మారుతున్నారని, టీడీపీ ఎంపీతో అర్థరాత్రి రహస్య మంతనాలు జరిపారని, 600 కోట్లు టీడీపీ ఆఫర్ చేసిందని ఇలా ఎన్నో సార్లు టీడీపీ సోషల్ మీడియా బురద జల్లింది.
 
అయితే ప్రముఖ మీడియా ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మీరు టీడీపీలో చేరడానికి 11 మందితో కలిసి సిద్ధమయ్యారని, మీరు పార్టీ  మారుతున్నట్లు చాలా సార్లు ఆరోపణలు వచ్చాయని, మీరు టీడీపీ ఎంపీతో టచ్ లో ఉన్నారని వార్తలు వచ్చాయని  యాంకర్ అడిగారు.. దీనిపైనా స్పందించిన శ్రీకాంత్ రెడ్డి టీడీపీ వాళ్ళకి దమ్ముంటే వారు మీడియా ముందుకు వచ్చి ఆ విషయం చెప్పాలని డిమాండ్ చేసారు.. 
 
ఒక టీడీపీకి సంబందించిన వెబ్ సైట్ ఇలాంటి వార్తలు రాసి బురదజల్లుతుందని, ఆ వెబ్ సైట్ టీడీపీ ఆఫీస్ నుండి నడుస్తుందని ఆరోపించారు... ఆ వెబ్ సైట్ వాళ్ళకి మెయిల్ పెట్టినా వాళ్ళ నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదని చెప్పారు...టీడీపీ ఆఫీస్ నుండి ఇలాంటి తప్పుడు వార్తలు రాయించడానికి వాళ్ళకి సిగ్గుండాలని చెప్పారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.