శ్రీకాంత్ రెడ్డి పంచ్ లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-27 14:38:46

శ్రీకాంత్ రెడ్డి పంచ్ లు

ప్ర‌తిప‌క్ష వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ, రాయ‌చోటి ఎమ్మెల్యే గ‌డికోట శ్రీకాంత్ రెడ్డి మ‌రోసారి ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబుపై నిప్పులు చెరిగారు... గ‌తంలో గ‌వ‌ర్న‌ర్ నరసింహన్‌ చంద్ర‌బాబును పొగిడిన‌ప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు క‌లిసి ఆయ‌న‌ను స‌న్మానించింది  మ‌రిచిపోయారా అని శ్రీకాంత్ రెడ్డి ప్ర‌శ్నించారు... టీడీపీకి  అనుకూలంగా మాట్లాడితే స‌న్మానాలు అదే వ్య‌తిరేకంగా మాట్లాడితే విమర్శ‌లు చేస్తారా అని ప్ర‌శ్నించారు.
 
గతంలో ఇదే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌న మామ ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన‌ప్పుడు ఆ స‌మ‌యంలో చంద్ర‌బాబు గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌స్థ‌ను వాడుకున్నార‌ని శ్రీకాంత్ రెడ్డి గుర్తు చేశారు...ఇలా త‌న‌కు అనుకూలంగా వాడుకున్న‌ప్పుడు త‌ప్పులేదు కానీ, జ‌రిగింది తప్ప‌ని చెబితే గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌స్థ‌ను ర‌ద్దు చేయాల‌ని మాట్లాడ‌టం ఎంత వ‌ర‌కూ  క‌రెక్టో మీరె చెప్పాల‌ని అన్నారు.
 
2014 ఎన్నిక‌ల ప్ర‌చారంలో చంద్ర‌బాబు సుమారు ఆరు వంద‌ల‌కు పైగా హామీల‌ను ప్ర‌క‌టించి అధికారాన్ని ద‌క్కించుకున్నార‌ని, కానీ త‌మ నాయ‌కుడు వైఎస్ జ‌గ‌న్ అలాంటి త‌ప్పుడు హామీల‌ను ప్ర‌క‌టించి అధికారంలోకి రార‌ని అన్నారు.... నాటి నుంచి నేటి వ‌ర‌కూ వైఎస్ కుటుంబం ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండే ప‌థ‌కాల‌ను మాత్ర‌మే ప్ర‌క‌టిస్తార‌ని స్ప‌ష్టం చేశారు.
 
అధికార బ‌లంతో వైసీపీ ఎమ్మెల్యేలను డబ్బులతో కొని మంత్రి పదవులిచ్చి ప్రమాణ  స్వీకారం చేయించి  గవర్నర్‌ వ్యవస్థను కించపరిచారన్నారు... రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసింది సీఎం చంద్రబాబేనని శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు...ప్ర‌త్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలు ప్రాణాల‌ను సైతం లెక్క‌చేయ‌కుండా ఏపీ భ‌వ‌న్ లో నిరాహార దీక్ష చేస్తే చంద్ర‌బాబు మాత్రం ధర్మ పోరాట దీక్షతో ప్రజాధనం దుర్వినియోగం చేశార‌ని శ్రీకాంత్ రెడ్డి మండిప‌డ్డారు..
 
ఈ దీక్షలో చంద్ర‌బాబు డేరా బాబాను మరిపించేలా ప్రజలతో కాళ్లు మొక్కించుకోవడం సిగ్గుచేటని అన్నారు... సీఎం దీక్షకు బస్సులు ఏర్పాటు చేసినా జనం రాలేదని, అదే విజయవాడలో తమ అధినేత వైఎస్‌ జగన్‌ ప్రజా సంకల్పయాత్రకు కృష్ణా నదిపై ఉన్న వారధి ఊగిపోయేలా జనం వచ్చారని అన్నారు..

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.