బాబు నీకెందుకంత ఈగో...

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ycp mla fires on chandrababu naidu
Updated:  2018-03-19 05:40:00

బాబు నీకెందుకంత ఈగో...

బాబు నీకెందుకంత ఈగో!! ఎందుకంత దుర్భుద్ధి!! రాష్ట్ర ప్రయోజనాలు నీకు అవసరం లేదా!! మా నాయకుడు వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేర‌కు వైసీపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టారు మీరూ మాకు మ‌ద్ద‌తు ఇవ్వండి....లేదా మేమే అవిశ్వాస తీర్మానం పెడతాం మాకు మద్దతు ఇవ్వండి, రాజకీయం చేయకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము మీకు మ‌ద్ద‌తు ఇస్తామ‌ని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పిలుపునిచ్చారు... 
 
కేంద్రంపై వైసీపీ ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి అసెంబ్లీ సాక్షిగా మద్దతు ఇస్తాం అని ప్రకటించిన మీరు...కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే మళ్లీ మాట మార్చి మేము మద్దతు ఇవ్వం... మేము అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతాం అంటారా అని  శ్రీకాంత్ రెడ్డి మండిప‌డ్డారు.....ప్రత్యేక హోదా విషయంలో మా నాయకుడి బాటలోకి వచ్చారు, అలాగే అవిశ్వాస తీర్మాన  విషయంలోనూ మా బాటలోకి వచ్చారు చాలా సంతోషం...అలాగే మా నాయకుడిని చూసి  విలువల‌తో కూడిన రాజకీయం చేయండి అని అన్నారు...
 
చంద్రబాబు  అసలు మీకు చిత్తశుద్ధి ఉందా...ప్రత్యేక హోదాపై పూటకో మాట చెప్పి ప్రజలను మభ్యపెట్టిన మీరు, నాలుగు సంవత్సరాలుగా ఒకే మాటపై నిలబడిన వైసీపీపై బురదజల్లుతారా అని శ్రీకాంత్ రెడ్డి మండిప‌డ్డారు... మీరు ప్రజల శ్రేయస్సు కోరుకుంటే అందరితో కలిసిరావాలి అంతే కానీ ఏమి చేయకపోయినా మీ డప్పును మీరు కొట్టుకోవ‌డం మానండి లేకపోతే ప్రజలు మిమ్మ‌ల్ని తరుముతారన్నారు...
 
అందులో భాగంగానే చంద్రబాబు జీవితమంతా చీకటి రాజకీయాలు, అప్పుడేమో అర్థరాత్రి వెళ్లి చిదంబరం, భరద్వాజ కాళ్లు పట్టుకుని మా నాయకుడిపై కేసులు పెట్టించారు... మ‌ళ్లీ ఇప్పుడు మా నాయకుడు కేంద్రంపై పోరాడుతుంటే మీరేమో దుష్టరాజకీయాలు చేస్తున్నారని అన్నారు... మీ జీవితమంతా మీడియా మేనెజ్ చేయడానికే సరిపోతుంది..ఇప్పటికైనా దాని నుండి బయటకు రండి...ప్రజలకు నిజాలు చెప్పి, ఓట్ల కోసం నోట్ల రాజకీయాలను మానుకోండి... అలాగే చంద్రబాబు శకం ముగిసిందని, టీడీపీ పని అయిపోయిందని ప్రజలు భావిస్తున్నార‌ని...  వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు... 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.