బాబు ర‌హ‌స్యాన్ని బ‌య‌ట పెట్టిన శ్రీ కాంత్ రెడ్డి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-23 16:39:11

బాబు ర‌హ‌స్యాన్ని బ‌య‌ట పెట్టిన శ్రీ కాంత్ రెడ్డి

ప్ర‌తిప‌క్ష వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ రాయ‌చోటి ఎమ్మెల్యే గ‌డికోట శ్రీకాంత్ రెడ్డి మ‌రోసారి మీడియా స‌మ‌క్షంలో ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు...ప్ర‌త్యేక హోదా కోసం త‌మ‌పార్టీ ఎంపీలు ప్రాణాలను సైతం లెక్క‌చేయ‌కుండా కేంద్రంతో పోరాడుతుంటే, చంద్ర‌బాబు త‌న ఎంపీల‌తో రాజీనామా చేయించ‌కుండా బీజేపీ తో ర‌హ‌స్య మంతనాలు, లాలూచీ కార్య‌క్ర‌మాలు చేస్తున్నార‌ని శ్రీకాంత్ రెడ్డి మండిప‌డ్డారు.
 
రాయచోటి  పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేక‌ర్ల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ... రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీపై పోరాటం చేస్తున్నామంటూ సీఎం చంద్రబాబు ఒకపక్క డైలాగుల మీద డైలాగులు కొడుతున్నారని తెలిపారు...మీ ఎంపీల‌తో రాజీనామా చేయించ‌లేని మీరు ఇప్పుడు బీజేపీని విమ‌ర్శిస్తున్నామంటూ ప్ర‌చారం చేయ‌డం స‌రికాద‌ని అన్నారు...  అయితే ఇదంతా త‌న‌పై ఎక్కడ ఓటుకు నోటు కేసులు పెడతారోనని భయపడి ప‌రోక్షంగా బీజేపీతో లాలూచి బేరాలు కొనసాగిస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.
 
ఇలా అడుగ‌డుగునా ఏదో ఒక సాకు చెప్పి త‌ప్పించుకుంటుకుంటున్నార‌ని అన్నారు.. వైసీపీ ఎంపీలు రాజీనామా చేసి ఏపీ భ‌వ‌న్ లో ఆరు రోజులు పాటు నిరాహార దీక్ష చేస్తే వారికి మ‌ద్ద‌తు ఇవ్వ‌కుండా పెట్టుబ‌డుల పేరుతో చంద్ర‌బాబు సింగ‌పూర్ కు వెళ్లార‌ని ఆరోపించారు... రాష్ట్రానికి పెట్టుబ‌డులు పేరు చెప్పి చంద్ర‌బాబు ప్ర‌త్యేక‌ విమానంలో ప్ర‌జా ధ‌నాన్ని అధికార బ‌లంతో అక్ర‌మంగా విదేశాల‌కు త‌ర‌లించుకుంటున్నార‌ని శ్రీ కాంత్ రెడ్డి అన్నారు.
 
అందులో భాగంగానే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిపై కాంగ్రెస్‌తో కలిసి 7 పార్టీలు అభిశంసన తీర్మానం పెడితే, బీజేపీతో పోరాడుతున్నామని చెప్పే టీడీపీ అభిశంసన తీర్మానానికి ఎందుకు మద్దతు ఇవ్వలేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు... అలాగే టీటీడీ బోర్డు సభ్యుల నియామకంలో బీజేపీకి సంబంధించిన మహారాష్ట్ర ఆర్థిక మంత్రి భార్యకు కల్పించిన స్థానంపై  సమాధానం ఇవ్వాలన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.