బాబు చివ‌ర‌కు వారిని కూడా వ‌ద‌ల్లేదు వైసీపీ ఎమ్మెల్యే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-23 18:24:02

బాబు చివ‌ర‌కు వారిని కూడా వ‌ద‌ల్లేదు వైసీపీ ఎమ్మెల్యే

అధికార‌ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న‌తరుణంలో అల‌ర్ట్ అయి రాష్ట్ర వ్యాప్తంగా ధ‌ర్మ‌పోరాట దీక్ష పేరుతో అధ‌ర్మ పోరాట దీక్షలు చేస్తున్నార‌ని ప్ర‌తిపక్ష‌ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాయ‌చోటి ఎమ్మెల్యే  శ్రీకాంత్ రెడ్డి మండిప‌డ్డారు. ఈ రోజు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ, 2014లో టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు రాష్ట్రానికి ఒక్క హామీను సాధించ‌లేక పోయార‌ని ఆయ‌న ఆరోపించారు.
 
పైగా అధికార బ‌లంతో ప్ర‌జా ధ‌నాన్ని విచ్చ‌ల‌విడిగా ఖ‌ర్చు చేస్తూ స‌భ‌ను ఏర్పాటు చేసిన ప్ర‌తీ సారి సుమారు 40 నుంచి 50 కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చు చేస్తున్నార‌ని శ్రీకాంత్ రెడ్డి విమ‌ర్శించారు. అలాగే న‌ష్టాల్లో ఉన్న ఆర్టీసీ బ‌స్సుల‌ను ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌న ప్ర‌చారానికి వాడుకుంటున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు.  తెలుగుదేశం పార్టీ హయాంలో దేశానికి అన్నం పెట్టే రైతులతో పాటు డ్వాక్రా మ‌హిళ‌లను కూడా  మోసం చేసిన ఘ‌న‌త కేవ‌లం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకే ద‌క్కుతుంద‌ని శ్రీకాంత్ రెడ్డి మండిప‌డ్డాడు.
 
ప్ర‌త్యేక హోదాకోసం కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాల‌తో నాలుగు సంవ‌త్స‌రాలుగా పోరాడుతున్న‌ది త‌మ పార్టీయేన‌ని మ‌రోసారి గుర్తు చేశారు. మొన్న అధికార టీడీపీ ఎంపీలు కేంద్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా పెట్టిన అవిశ్వాస తీర్మానంపై పార్ల‌మెంట్ లో చ‌ర్చ జ‌రిగితే ఆ చ‌ర్చ‌లో టీడీపీ ఎంపీలు విఫ‌లం అయినందున తాము రేపు వైసీపీ బంద్ కు పిలుపు నిచ్చామ‌ని అయితే బంద్ కు ప్ర‌తీ ఒక్క‌రు హాజ‌రు అయి విజ‌య‌వంతం చెయ్యాల‌ని శ్రీకాంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.