శ్రీకాంత్ రెడ్డి సంచ‌ల‌న హామీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-06 18:24:57

శ్రీకాంత్ రెడ్డి సంచ‌ల‌న హామీ

ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాయ‌చోటి ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ గ‌డికోట శ్రీకాంత్ రెడ్డి ఈ రోజు క‌డ‌ప జిల్లా రామాపురంలోని వైసీపీ బూత్ కన్వీనర్లతో స‌మావేశం అయ్యారు. ఈ స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ,వ‌చ్చే ఎన్నిక‌ల్లో దోపిడీ  ప్రభుత్వం అయిన‌టువంటి తెలుగు దేశంపార్టీని ఇంటికి సాగనంపేందుకు వైసీపీ బూత్ కమిటీలు సైన్యం లాగ పనిచేయాలని శ్రీకాంత్ రెడ్డి సూచించారు.
 
తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టి  నాలుగేళ్లు పూర్తయినా  ప్రజలకు చేసింది సూన్యం అని వాపోయారు. ప్రజలకోసం నిత్యం పరితపిస్తున్న వ్యక్తి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని ఆయన పోరాటం స్ఫూర్తిదాయకం అని శ్రీకాంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. అలాగే వ‌చ్చేఎన్నిక‌ల్లో తాము బీజేపీతో పొత్తు పెట్టుకోమని తెలిపారు. 
 
ప్ర‌తీ ఓటర్లను తరచూ కలిసేలా బూత్ కమిటీలు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల‌ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన త‌ర్వాత 16 నెలలు పూర్తి కాక‌ముందే గాలేరు నగరి ద్వారా రామాపురం మండలంలో ఉన్న అన్ని చెరువులకు నీరు తెప్పిస్తామ‌ని శ్రీకాంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అలాగే ప్రభుత్వ ఐ టి ఐ, గువ్వలచెరువు సమీపం లో పరిశ్రమలు, ప్రభుత్వ కళాశాలల ఏర్పాటుకు కృషి చేస్తాన‌ని అన్నారు. తాను ప్ర‌క‌టించిన హామీల‌ సంక్షేమానికి ముందుండి పోరాడుతాన‌ని స్ప‌ష్టం చేశారు. అలాగే న‌గ‌రంలో ఉన్న ఓటర్ల లిస్టు పై క