చంద్ర‌బాబు చిల్లి గ‌వ్వ‌కూడా ఇవ్వ‌లేదు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-16 15:46:16

చంద్ర‌బాబు చిల్లి గ‌వ్వ‌కూడా ఇవ్వ‌లేదు

మైనార్టీల‌కు మేలు జ‌రిగిందంటే అది  కేవ‌లం మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి వ‌ల్లే అని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, అలాగే మాజీ ఎంపీ మిథున్ రెడ్డిలు స్ప‌ష్టం చేశారు. ఈ రోజు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో వారు మాట్లాడుతూ, ప్ర‌స్తుతం తెలుగుదేశం పార్టీ హయాంలో మైనార్టీల‌కు న్యాయం జ‌రుగ‌లేద‌ని వారి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తాన‌ని అధికారంలోకి వ‌చ్చిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు గాలికి వ‌దిలేశార‌ని తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు.
 
గ‌తంలో వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి మైనార్టీల‌ను గుండెల్లో పెట్టుకుని చూశార‌ని, ఈ విష‌యాన్ని స్వ‌యాన మైనార్టీలే చెబుతున్నార‌ని మిథున్ రెడ్డి స్ఫ‌ష్టం చేశారు. అయితే తండ్రి బాట‌లోనే త‌న త‌న‌యుడు కూడా మ‌రిన్ని సంక్షేమ ప‌థ‌కాల‌తో మీ ముందుకు వ‌స్తున్నార‌ని ఆయ‌న‌ను ఆహ్వ‌నించ‌వ‌ల‌సిన బాధ్య‌త ప్ర‌తీ ఒక్క‌రిపై ఉంద‌ని వారు స్ప‌ష్టం చేశారు. 
 
మ‌హానేత వైఎస్సార్ వ‌ల్లే రాయ‌చోటికి తాగునీరు ల‌భించింద‌ని, ఆయ‌న బాట‌లోని న‌డుస్తూ ప‌ట్ట‌ణ‌ ప్ర‌జ‌ల‌కు ఉచితంగా శుద్ది నీరు అందించేందుకు శ్రీకారం చుడుతున్నామ‌ని శ్రీకాంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. అయితే ప్ర‌స్తుత ముఖ్య‌మ‌త్రి చంద్ర‌బాబు నాయుడు నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ది కోసం చిల్లి గ‌వ్వ‌కుడా ఇవ్వ‌లేద‌ని శ్రీకాంత్ రెడ్డి మండిప‌డ్డారు. టీడీపీ నాయ‌కులు చేస్తున్న అవినీతి అక్ర‌మాల‌ను ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని వ‌చ్చే ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు నాయుడుకు త‌గిన బుద్ది చెబుతార‌ని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.