శ్రీకాంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-29 18:17:24

శ్రీకాంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ రాయ‌చోటి ఎమ్మెల్యే గ‌డికోట శ్రీకాంత్ రెడ్డి మ‌రోసారి వైసీపీ కార్యాల‌యంలో మీడియా స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ స‌మావేశంలో అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.రాజ్య స‌భ స‌భ్యుడు అయిఉండి కూడా సంస్కారం లేకుండా టీడీపీ ఎంపీ జేసీ స‌మావేశంలో మాట్లాడుతున్నార‌ని మండిప‌డ్డారు.
 
దాదాపుగా న‌ల‌బై సంవ‌త్స‌రాల నుంచి రాజ‌కీయాల్లో ఉన్న‌టు వంటి వ్య‌క్తి  జేసీ దివాక‌ర్ రెడ్డి.  ఆయ‌న రాబోవు త‌రాల‌కు ఎలాంటి స‌మాచారం ఇవ్వాలి అన్న ఆలోచ‌న లేకుండా, చంద్ర‌బాబు నాయుడిని సంతోష ప‌ర‌చాల‌నే ఉద్దేశంతో ఇష్టం వ‌చ్చిన‌ట్లు జేసీ మాట్లాడుతున్నార‌ని శ్రీకాంత్ రెడ్డి మండిప‌డ్డారు. తాను హైలెట్ కావ‌డానికి అవ‌స‌ర‌మైతే జేసీ ముఖ్యమంత్రులకు భజన రాజ‌కీయాలు చేస్తార‌ని, అది ఆయ‌న‌కు అల‌వాటే అని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.
 
ఇలా భ‌జ‌న రాజ‌కీయాలు చేసుకునే జేసీ దివాక‌ర్ రెడ్డికి వైఎస్ కుటుంబాన్ని విమ‌ర్శించే అర్హ‌త లేద‌ని అన్నారు. అలాగే తాడిప‌త్రిలో అరాచ‌కాల‌కు అంతులేకుండా పోయింద‌ని, ఆత్మహత్యలు ఆగడం లేదని ఆరోపించారు. రైతుల ద‌గ్గ‌ర నుంచి పరిశ్రమల పేరుతో వేల ఎకరాలు లాక్కుంటున్నారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. 
 
దీంతో పాటు 2014 ఎన్నికల‌ మ్యానిఫెస్టోలో సుమారు ఆరువంద‌ల‌కు పైగా హామీల‌ను ప్ర‌జ‌ల‌కు ప్ర‌క‌టించి చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చార‌ని, అయితే అధికారంలోకి వ‌చ్చి సుమారు నాలుగు సంవ‌త్స‌రాలు పూర్తి అయిన కూడా ఒక్క హామీని కూడా పూర్తి చేయ‌లేద‌ని శ్రీకాంత్ రెడ్డి మండిప‌డ్డారు. తాము టీడీపీ మ్యానిఫెస్టోలో పొందుప‌రిచిన హామీల‌ను పూర్తిగా అమ‌లు చేశామ‌ని ధైర్యంగా మహానాడు కార్య‌క్ర‌మంలో ఒక్కరు కూడా మాట్లాడలేక‌పోతున్నార‌ని ఆరోపించారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.