టీడీపీ నాయ‌కుల‌పై వైసీపీ ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ysr congress party flag
Updated:  2018-08-01 04:53:20

టీడీపీ నాయ‌కుల‌పై వైసీపీ ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్య‌లు

కాపు రిజర్వేషన్ల విషయంలో మొదటినుంచీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తుంది ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడే అని ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాయ‌చోటి ఎమ్మెల్యే  శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. ఈ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిని మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ, గతంలో విజయభాస్కర్ రెడ్డి రిజర్వేషన్లను మంజూరు చేస్తే... కోర్ట్ కు వెళ్ళి స్టే తీసుకువ‌చ్చింది ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడని ఆయ‌న విర్శ‌లు చేశారు. ఈ విష‌యం అందరికీ తెలుస‌ని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. నాలుగు సంవత్సరాలు బీజేపీతో పొత్తుపెట్టుకుని రిజర్వేషన్లపై ఒక్క రోజుకుడా ప్ర‌స్తావించ‌లేద‌ని శ్రీకాంత్ రెడ్డి మండిప‌డ్డారు. 
 
వైసీపీ అధినేత‌ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రిజర్వేషన్ల అంశంపై ప్ర‌స్తావిస్తూ తాను కాపుల‌కు వ్య‌తిరేకం కాద‌ని రిజ‌ర్వేష‌న్ల అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలోది కాబ‌ట్టి తాను రిజ‌ర్వేష‌న్లు ప్ర‌క‌టించ‌లేన‌ని అన్నారు. కానీ తాను అధికారంలోకి వ‌స్తే ప్ర‌స్తుతం టీడీపీ ప్ర‌భుత్వం కాపు కార్పోరేష‌న్ సంఘాల‌కు ఎంత‌మేర‌కు నిధులు కేటాయిస్తుందో తాను అంత‌కంటే రెండింత‌లు నిధుల‌ను కేటాయిస్తాన‌ని స్ప‌ష్టం చేశారు అని తెలిపారు. అయితే ఇదే అదునుగా చేసుకుని టీడీపీ నాయ‌కులు జ‌గ‌న్ కాపుల‌కు వ్య‌తిరేకం అంటు నినాదాలు చేయ‌డం దారుణం అని శ్రీకాంత్ రెడ్డి మండిప‌డ్డారు.
 
ఇక ఇదే మాటను మంత్రి యనమల రామకృష్ణుడు అంటే దానిపైన చర్చ ఎందుకు జ‌ర‌ప‌రని ఆయ‌న విమ‌ర్శ‌లు చేశారు. ఉదయం లేచినప్పుడు నుంచి ఎల్లోమీడియా వార్తల్లో డిబేట్ లలో పూర్తిగా తెలుగుదేశం పార్టీకి కొమ్ముకాస్తూ వాస్తవాలను  వక్రీకరిస్తోందని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. మైనారిటీలు కు రిజర్వేషన్లు ఇచ్చిన సమయం లో కేంద్ర ప్రభుత్వం కోసం ఎదురుచూడకుండా, పండుగ చేసుకోండి అంటూ ఆర్భాటాలు చేయకుండా  దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ఆర్ ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించారని ఆయన గుర్తు చేశారు. 
 
కానీ ఈ ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు ప్రకటనలు, ప్రచారాలు కోసం ఖర్చు పెడుతూ, కాపు రిజర్వేషన్లు ను అమలు కాకుండా, వాళ్లకు మేలు చేయకుండా రాజకీయాలు చేస్తున్నారని విమ‌ర్శ‌లు చేశారు. ఉద్యమం చేస్తున్న ముద్రగడ పద్మనాభంను టీడీపీ ప్రభుత్వం దారుణం గా  హింసించిందని గుర్తు చేశారు. వైఎస్ ఆర్ సీపీ ఏదైతో చెప్పిందో  కాపులకు రిజర్వేషన్లలో బీసీల మనోభావాలు దెబ్బతినకుండా  చేసేందుకు  కట్టుబడతామని మొదటి నుంచీ చెబుతూనే వస్తున్నామని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.