ఓకెతాటిపైకి వైసీపీ, జనసేన

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-21 18:25:01

ఓకెతాటిపైకి వైసీపీ, జనసేన

ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుకై విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో రాయచోటి లోని ప్రభుత్వ బాలికల కళాశాల ఆవరణలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, వైసీపీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు...
 
ఈ సందర్భంగా రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రత్యేక హోదా వస్తేనే విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుంది...రాజకీయాలకు అతీతంగా జనసేన, వైసీపీ ఒక తాటిపైకి వచ్చి పోరాడితే ప్రత్యేక హోదా వస్తుంది... ఈ రోజు ఒక అడుగు ముందుకు వేసి రాజకీయాలకు అతీతంగా జనసేన, వైసీపీ ఒక తాటిపైకి తీసుకువచ్చి విద్యార్థి, యువజన సంఘాలు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు... ఇది శుభ పరిణామం అని అన్నారు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి..
ycp
 
ఈ వాతావరణమే రాష్ట్రం మొత్తం వస్తే టీడీపీని, బీజేపీల మెడలు వంచి ప్రత్యేక హోదాను సాధించుకోవచ్చు... ఆరోజు వెంకయ్య నాయుడు ఐదేళ్లు కాదు, పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని రాజ్యసభలో చెప్పారు...ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా ప్రత్యేక హోదా గురించి మాట్లాడకుండా వెంకయ్య నాయుడు తూట్లు పొడిచారు అని విమర్శలు చేశారు శ్రీకాంత్ రెడ్డి...
sikanth reddy
 
వైసీపీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ, ప్రత్యేక హోదా రావాలంటే ఏపీలో ఉన్న 25 ఎంపీ సీట్లలోనూ వైసీపీని గెలిపించండి..ఈరోజు హోదా సజీవంగా ఉందంటే దానికి కారణం వైసీపీ, జగన్ మోహన్ రెడ్డి మాత్రమే.. వైసీపీ చేసిన పోరాటాలకు బయపడి టీడీపీ కూడా యూ - టర్న్ తీసుకుంది అని విమర్శలు చేశారు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.