గ‌ర్జ‌న సాక్షిగా వైసీపీ ఎమ్మెల్యే సంచ‌ల‌న నిర్ణ‌యం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-02 18:06:20

గ‌ర్జ‌న సాక్షిగా వైసీపీ ఎమ్మెల్యే సంచ‌ల‌న నిర్ణ‌యం

2014లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు అధికార‌మే ల‌క్ష్యంగా చేసుకుని బీజేపీతో పొత్తుపెట్టుకుని ప్ర‌త్యేక‌హోదాను తాక‌ట్టుపెట్టి రాష్ట్రానికి తీర‌ని అన్యాయం చేశార‌ని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచ‌మల్లు శిప్ర‌సాద్ రెడ్డి విమ‌ర్శలు చేశారు.
 
అనంత‌పురం జిల్లాలో వంచ‌న‌పై గ‌ర్జ‌న దీక్ష స‌భ‌లో రాచ‌మ‌ల్లు మాట్లాడుతూ, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడిపై, అలాగే ఫిరాయింపు ఎమ్మెల్యేల‌పై ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.గ‌త ఎన్నిక‌ల ప్ర‌చారంలో టీడీపీ నాయ‌కులు రాష్ట్రానికి ఒక‌టికాదు రెండుకాదు సూమారు ఆరువంద‌ల‌కు పైగా త‌ప్పుడు హామీల‌ను ప్ర‌క‌టించి అధికారంలోకి వ‌చ్చార‌ని కానీ, ఇంత‌వ‌ర‌కూ ఒక్క హామీను కూడా అమ‌లు చేయ‌లేద‌ని రాచ‌మ‌ల్లు మండిప‌డ్డారు.
 
టీడీపీ అధికారంలోకి వ‌చ్చి నాలుగు సంవ‌త్స‌రాలు పుర్తి చేసుకుంద‌ని అయితే ఈ నాలుగు సంవ‌త్స‌రాల్లో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు 29 సార్లు ఢిల్లీకి ప్ర‌యాణం చేశార‌ని అయితే తిరిగి వ‌చ్చేట‌ప్పుడు వ‌ట్టి చేతుల‌తో వ‌చ్చార‌ని రాచ‌మల్లు తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. ముఖ్య‌మంత్రి కేవ‌లం రాజ‌కీయ ప్ర‌యెజ‌నాల‌ను ప‌రిర‌క్షంచుకోవ‌డానికి గుట్టు చ‌ప్పుడు కాకుండ ఢిల్లీకి వెళ్లి వ‌స్తున్నారు త‌ప్ప రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కోసం వెళ్ల‌లేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.
 
టీడీపీ హ‌యాంలో పోల‌వ‌రాన్ని నిర్మించి ఈ జాతికి అంద‌జేస్తాన‌ని చెప్పార‌ని రాచ‌మ‌ల్లు గుర్తు చేశారు. ప్ర‌జ‌ల‌కు అవ‌స‌ర‌మైన పోల‌వ‌రాన్ని టీడీపీ నాయ‌కులు వ‌రంగా భావించి ధ‌న దాహం తీర్చ‌కునేందుకు ఉప‌యోగించుకుని పోల‌వ‌రాన్ని అట‌కెక్కించార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేల‌ను, ముగ్గురు ఎంపీల‌ను చంద్ర‌బాబు నాయుడు ప‌శువుల దొడ్డిలో ప‌శుల‌ను క‌ట్టేసుకున్న‌టు వారిని క‌ట్టేసుకున్నార‌ని విమ‌ర్శ‌లు చేశారు. 
 
క‌డ‌ప జిల్లాలో రెండు ప‌శువులు టీడీపీకి అమ్ముడు పోయాయ‌ని, అలాగే అనంత‌పురం జిల్లాలో కూడా ఒక ప‌శువు టీడీపీకి అమ్ముడు పోయింద‌ని తీవ్ర‌స్థాయిలో రాచ‌మ‌ల్లు విమ‌ర్శ‌లు చేశారు. ఇక ఇప్పుడు ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో టీడీపీ నాయ‌కులు దొంగ దీక్ష‌లు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. మొన్న క‌డ‌ప ఉక్కును డిమాండ్ చేస్తూ టీడీపీ ఎంపీ సీఎం ర‌మేష్ దీక్ష పేరుతో 11 రోజులు బోగ‌స్ దీక్ష చేశార‌ని విమ‌ర్శించారు. ర‌మేష్ నాయుడు 11 రోజులు దీక్ష చేస్తే కొత్త పెళ్లి కొడుకులా నిగ‌నిగ‌లాడిపోతున్నార‌ని అన్నారు. టీడీపీ నేతలకు దీక్షా నియమాలు తెలియవని, చంద్రబాబు గద్దె దిగేదాకా నల్ల కండువా ధరిస్తానని రాచ‌మల్లు శివ‌ప్ర‌సాద్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.