వైసీపీ ఎమ్మెల్యేల అరెస్ట్ ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-04 15:45:10

వైసీపీ ఎమ్మెల్యేల అరెస్ట్ ?

గుంటూరు జిల్లా దాచేప‌ల్లి ఘ‌ట‌న పై ఇప్ప‌టికే రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న‌లు వెల్లువెత్తుతున్నాయి.. దాచేపల్లిలో మృగాడి దాడిలో తీవ్రంగా గాయపడిన మైనర్‌ బాలికకు న్యాయం చేయాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు ఆర్కే రోజా, ముస్తఫా, గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి గుంటూరు ప్రభుత్వాసుపత్రి ముందు  రాస్తారోకోకు దిగారు.. ప్ర‌భుత్వ వైఖ‌రికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు.. దీంతో ఇక్క‌డ‌కు పోలీసులు చేరుకుని వైసీపీ ఎమ్మెల్యేల‌ను అరెస్ట్ చేశారు.
 
వైసీపీ ఎమ్మెల్యే రోజా ముందుగా గుంటూరు ప్ర‌భుత్వాసుప‌త్రిలో చికిత్స పొందుతున్న బాలిక‌ను ప‌రామ‌ర్శించారు..ఆమె ఆరోగ్యం గురించి అక్క‌డ అధికారులు కుటుంబ స‌భ్యులను అడిగి తెలుసుకున్నారు.. బాలికకు నాలుగు కుట్లు పడ్డాయని, తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతోందని రోజా చెప్పారు. మనం రాష్ట్ర రాజధాని ప్రాంతంలో బతుకుతున్నామా..? లేక అడవిలో ఉ‍న్నామా? అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు.
 
మగాళ్లు అంటేనే బాలిక భయపడి ఏడుస్తోందని చెప్పారు. ఆసుపత్రి సూపరిటెండెంట్‌ గది లోపలికి వచ్చినా హడలిపోతోందని, మనషులకు ఇంత చీప్‌ మెంటాలిటీ ఉంటుందని తెలిసి కుమిలిపోతోందని తెలిపారు రోజా. మగాళ్లు మృగాళ్లలా ప్రవర్తిస్తారని చిన్నారి మనసులో ముద్రించుకుపోయిందని వివరించారు. ఇంతవరకూ నిందితుడిని అరెస్టు చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని అన్నారు. ఈ స‌ర్కారు పాల‌న‌లో మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోయింది అని ఆమె ఫైర్ అయ్యారు... అమ‌రావ‌తి రాజ‌ధాని  దగ్గ‌ర ప్రాంతంలో ఇలాంటి ఘ‌ట‌న జ‌రిగితే చంద్ర‌బాబు ఏం చేస్తున్నారు అని ఆమె నిల‌దీశారు.
 
ఈ ఘ‌ట‌న జ‌రిగిన కొద్ది సేప‌టికే తుని లో టీడీపీ నాయకుడు ఒకరు బాలికపై అత్యాచారానికి ప్ర‌యత్నించారు... ఎమ్మార్వో వనజాక్షిపై దాడి చేసిన చింతమనేనిపై చర్యలు లేవు. కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌లో ఉన్న టీడీపీ నేతలపై చర్యలు తీసుకోలేదు. మహిళా వ్యతిరేక నేరాల్లో ఐదుగురు టీడీపీ నాయకులు ఉన్నట్లు అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌(ఏడీఆర్‌) రిపోర్టులో పేర్కొంది.కేసుల్లో ఇరుక్కున్న నేతలకు పదవులు అప్పగిస్తూ చంద్రబాబు వారికి మద్దతుగా నిలుస్తున్నారు.
 
అందుకే ఈ దాడులు మ‌రింత పెరుగుతున్నాయి...చంద్రబాబుకు ఆడవాళ్లు ఉసురు కచ్చితంగా తగులుతుంది అని ఆమె ఫైర్ అయ్యారు. ఒక ముఖ్యమంత్రి, డీజీపీ ఉన్న చోట ఈ ఘటనలు జరుగుతున్నాయి. ఈ ఘోరాలకు పాల్పడుతున్న వారిలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, వారి మద్దతుదారులే ఎక్కువ మంది ఉన్నారు. ఇక పోలీసులు ఏమీ చేస్తున్నారు అని ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే రోజా... అత‌నిని ప‌ట్టుకుని శిక్షించాలి అని ఆమె పోలీసుల‌ను- స‌ర్కారుని కోరారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.