వైకాపా ఎమ్మెల్యేలు కీల‌క ప్ర‌క‌ట‌న

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-19 05:24:28

వైకాపా ఎమ్మెల్యేలు కీల‌క ప్ర‌క‌ట‌న

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాలు అత్యంత‌రం ఆస‌క్తిక‌రంగా మారాయి. ఎప్పుడు ....ఎవ‌రు...ఎలాంటి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌నలు చేస్తారో అర్ధం కాని ప‌రిస్ధితిలో ఇప్పుడు ఏపీ రాజ‌కీయాలు కొన‌సాగుతున్నాయి. రాజీనామాలే కాదు...అవిశ్వాసం పెట్టేందుకు కూడా సిద్ద‌మంటూ కొత్త రాజ‌కీయాల‌కు తెర‌లేపారు వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. 
 
కేవ‌లం జ‌గ‌న్ మాత్ర‌మే కాదు....త్వ‌ర‌లో వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు కీల‌క ప్ర‌క‌ట‌న చేసేందుకు సిద్ద‌మయ్యారు.  టీడీపీ అధికారంలోకి వ‌చ్చాక వైసీపీకి చెందిన ఎమ్మెల్యేల నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎలాంటి అభివృద్ది కార్య‌క్ర‌మాలు జ‌ర‌గ‌డం లేద‌ని వారు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. 
 
దీంతో ప్ర‌జ‌లకు నిజా నిజాలు తెలియ‌జేసేందుకు వైకాపా అనేక ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉంది. ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌భుత్వ తీరును ప్ర‌జ‌ల‌కు చెబుతూనే వ‌స్తున్నారు.  ఇక ఇప్పుడు  హోదా  కోసం త‌మ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తున్న నేప‌థ్యంలో తాము కూడా రాజీనామా చేస్తామ‌నే ప్ర‌తిపాద‌న‌ను అధినేత జ‌గ‌న్ ముందు ఉంచార‌ట‌. 
 
ఈ నెల చివ‌ర్లో వైయ‌స్ జ‌గ‌న్, సొంత పార్టీ ఎమ్మెల్యేల‌తో స‌మావేశం అవ్వ‌నున్నారు. ఈ స‌మావేశాల్లో రాజీనామాల‌కు సంబంధించి అంతిమ నిర్ణ‌యం తీసుకోనున్నారు. త‌మ అధినేత ఆదేశిస్తే హోదా కోసం ఇప్ప‌టికిప్పుడు రాజీనామా చేసేందుకు సిద్ద‌మంటూ వైసీపీ ఎమ్మెల్యేలు రాజ‌న్న దొర‌, రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్ రెడ్డి, ఆళ్ల రామకృష్ణా రెడ్డి వంటి వారు చెబుతున్నారు. దీంతో త్వ‌ర‌లోనే ఎంపీల‌తో పాటు ఎమ్మెల్యేలు  కూడా రాజీనామాలు  చేసే అంశంపై ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఇదే జ‌రిగితే ఏపీలో రాజ‌కీయాలు మ‌రింత ఆస‌క్తిక‌రంగా మారే అవ‌కాశం ఉంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.