ఎంపీ మేక‌పాటి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-17 18:57:04

ఎంపీ మేక‌పాటి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఏపీకి  ప్ర‌త్యేక హోదా ప్ర‌క‌టించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర వైఖ‌రిని నిర‌సిస్తున్నారు ప్ర‌జలు రాజ‌కీయ‌పార్టీలు.. ఈ నేప‌థ్యంలో మ‌రోవైపు ప్ర‌తీ ప‌క్షపార్టీ నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తాను చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో ప్ర‌త్యేక హోదా రాష్ట్రానికి ఎంత అవ‌స‌ర‌మో  వివ‌రిస్తూ ముందుకు సాగుతున్నారు... ప్ర‌స్తుతం ఈ సంక‌ల్ప‌యాత్ర తెలుగుదేశం పార్టీ కంచుకోట అయిన‌టువంటి గుంటూరు జిల్లాలో నిర్విరామంగా కొన‌సాగుతోంది.
 
అందులో భాగంగానే తమ పార్టీ నాయ‌కులు అవిశ్వాస తీర్మానానికి- ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని జ‌గ‌న్ కోరిన సంగ‌తి తెలిసిందే.... ఒక వేల చంద్రబాబు కేంద్రంపై పెట్టే త‌మ అవిశ్వాసానికి మ‌ద్ద‌తు తెలప‌కుంటే రానున్న రోజుల్లో రాజ‌కీయ చ‌రిత్ర హీనుడుగా మిగిలిపోతార‌ని అన్న సంగ‌తి విధిత‌మే.
 
అయితే ఈ నేప‌థ్యంలో వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు ఎంపీ మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి త‌మ పార్టీ అవిశ్వాసంపై  ఈ రోజు మీడియాతో మాట్లాడారు... చంద్ర‌బాబు ప్ర‌త్యేక హోదాపై అనేక అబ‌ద్ద‌పు మాట‌లు చెప్పి రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నార‌ని అన్నారు... అందులో భాగంగానే  అవిశ్వాస తీర్మానం పై రోజుకొక మాట మాట్లాడుతున్నార‌ని, అలాగే ఆయ‌న అనుకూల ఎల్లో మీడియాలు కూడా అంతా ముఖ్య‌మంత్రి చేసిన‌ట్లు ప్ర‌చారం చేయ‌డం సిగ్గుచేటు అని అన్నారు మేక‌పాటి.
 
2014 ఎన్నిక‌ల్లో అధికారాన్ని చేజిక్కించున్న చంద్ర‌బాబు కేంద్రం నుంచి విభ‌జ‌న హామీల్లో ఒక్క‌టి కూడా సాధించ‌లేక పోయారని మేక‌పాటి అన్నారు..తెలుగు దేశం పార్టీ నాయ‌కులు చేస్తున్న మొసాల‌ను ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిల్లో చంద్ర‌బాబుకు త‌గిన బుద్ది చెబుతార‌ని అన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.