జేసీకి మేక‌పాటి వార్నింగ్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-21 16:24:58

జేసీకి మేక‌పాటి వార్నింగ్

ప్రతి ప‌క్ష వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీకి ప్ర‌త్యేక హోదా కావాలంటూ ప్ర‌తీ రోజూ అలుపెరుగ‌ని పోరాటం చేస్తున్నారు... ఆ పార్టీ నాయ‌కుడు జ‌గన్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల‌మేర‌కు వైసీపీ ఎంపీలు కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టారు... అయితే మ‌రో వైపు అధికార తెలుగు దేశం పార్టీ నాయ‌కులు ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న పోరాటానికి వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు...  
 
వైసీపీ ఎంపీలు ఫ్ల‌కార్డులు ప‌ట్టుకుని ఏపీకి ప్ర‌త్యేక హోదా కావాలంటూ పార్ల‌మెంట్ లో నిర‌స‌న‌లు తెలుపుతుంటే  రాజ‌కీయ ప‌రంగా కాకుండా రాష్ట్ర ప్ర‌యోజ‌నాల దృష్ట్యా మ‌ద్ద‌తు తెల‌పాల్సింది పోయి వారిని మ‌రోసారి అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి  రెచ్చ‌గొట్టే ప‌నులు చేశారు. కొద్ది రోజుల క్రితం వైసీపీ ఎంపీల ముందు పార్ల‌మెంట్ ఎదుట తొడ‌కొట్టిన జేసీ మ‌రోసారి రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా రాద‌న్న‌ట్లు మాట్లాడి వారి ముందు తొడ‌కొట్టి మీసాలు మెలేశారు...
 
ఈ నేప‌థ్యంలో పార్ల‌మెంట్ ముందు జేసీ చేసిన వ్య‌వ‌హార తీరును వ్య‌తిరేకిస్తూ వైసీపీ నెల్లూరు ఎంపీ మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి మండిప‌డ్డారు... ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... మిస్ట‌ర్ జేసీ, రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా సాధించితీరుతామ‌ని, ఇది వైసీపీ నేత‌ల ఒక్క‌రి డిమాండ్ కాద‌ని ఐదు కోట్ల మంది డిమాండ్ అని అన్నారు.. దీంతో పాటు ప్ర‌త్యేక హోదా సాధ‌న‌కై తాను వైసీపీ త‌రుపున చాలెంజ్ చేస్తున్నాన‌ని మేక‌పాటి అన్నారు..
 
కాగా మ‌రోవైపు ఈ విష‌యంపై ప‌లు చోట్ల రాష్ట్ర ప్ర‌జ‌లు స్పందిస్తున్నారు... వైసీపీ నాయ‌కులు త‌మ ఇంటిన వ‌దిలేసి రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం కేంద్ర వైఖ‌రిని నిర‌సిస్తూ పార్ల‌మెంట్ లో ఆందోళ‌న చేస్తుంటే తెలుగు దేశం పార్టీ నాయ‌కులు ఇలా వ్య‌వ‌హ‌రించ‌డం ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు.. రాజ‌కీయాల్లో సీనియర్ నేత అయివుండి కూడా జేసీ ఇలా ప్ర‌వ‌ర్తించ‌డం మంచిది కాద‌ని ప్ర‌జ‌లు అంటున్నారు... అయితే  ఇప్పటికే టీడీపీ ఎంపీ శివప్రసాద్‌ వేస్తున్న రోజుకో వేషంతో మిగిలిన రాష్ట్రాల ఎంపీల వద్ద పరువు నిత్యం గంగలో కలుస్తుంటే జేసీ కూడా ఇలా వ్యవహరించడంపై విమర్శలు వస్తున్నాయి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.