మేకపాటికి అస్వస్థత

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-07 15:06:24

మేకపాటికి అస్వస్థత

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు ఎంపీ మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి ఈ రోజు తెల్ల‌వారు జామున‌ ఏపీ భ‌వ‌న్ లో తీవ్ర అనారోగ్యానికి గుర‌య్యారు... ఐదు కోట్ల మంది జ‌నాల కోరిక మేర‌కూ వైసీపీ ఎంపీలు వారి ప‌ద‌వులు సైతం లెక్కచేయ‌కుండా పార్టీ అధిష్టానం నిర్ణ‌యం మేర‌కు, అలాగే రాష్ట్ర అభివృద్ది కొర‌కు వైసీపీ ఎంపీలు వారి ప‌ద‌వుల‌కు రాజీనామా చేసి, స్పీక‌ర్ కు స‌మ‌ర్పించారు.. ఆ మ‌రుక్ష‌ణం నుంచే వైసీపీ ఎంపీలు ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష‌ మొద‌లు పెట్టిన సంగ‌తి తెలిసిందే.
 
అయితే ఈ దీక్ష‌లో పాల్గొన్న మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి కి ఈరోజు తెల్ల‌వారు జామున అక‌స్మాత్తుగా తీవ్ర‌మైన క‌డుపు నొప్పి రావ‌డంతో ఆయ‌న‌కు వెంట‌నే అక్క‌డ‌ ఉన్న డాక్ట‌ర్లు చికిత్స అందించారు... చికిత్స అందించిన వైద్యులు త‌ప్ప‌ని స‌రి మేక‌పాటి దీక్ష‌ను విర‌మించాల‌ని లేక‌పోతే ఆరోగ్యం ఇంకా క్షీణిస్తుంద‌ని తెలిపారు.. కానీ దీనికి మేక‌పాటి నిరాకరించారు.
 
రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు స‌మ‌కూర్చే ప్ర‌త్యేక హోదా కోసం తాను ఎంత‌టి దాకైనా పోరాడుతాన‌ని, ఈ పోరాటంలో త‌న ఆరోగ్యం క్షీణించిపోయినా ప‌ర్వాలేద‌ని వెల్ల‌డించారు మేక‌పాటి... కాగా నిన్న సాయంత్రం  ఢిల్లీలో ఈదురుగాలుల‌తో కూడిన వ‌ర్షం రావ‌డంతో ఏపీ భవన్ వద్ద  వైసీపీ దీక్షా శిబిరం టెంట్లు కుప్పకూలిపోయాయి... దీంతో వైసీపీ ఎంపీలు త‌మ దీక్ష‌ను ఏపీ భవన్ లోపల య‌దావిధిగా కొన‌సాగించాయారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.