ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బాబు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-26 18:37:20

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బాబు

ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్ళ నుండి పోరాడుతుంది వైసీపీ...టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక హోదాకు తూట్లుపొడవడానికి ప్రయత్నించినా, జగన్ పోరాట పటిమతో ప్రత్యేక హోదాను సజీవంగా ఉంచారు...అధికార పార్టీ ప్రత్యేక హోదాపై రోజుకో మాట మాట్లాడుతున్న, ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఒకే మాటపై నిలబడి నాలుగేళ్ళ నుండి పోరాడుతున్నారు. ప్రత్యేక హోదా కోసం ఎన్నో పోరాటాలు కూడా చేశారు.
 
అందులో భాగంగానే ప్రత్యేక హోదా కోసం పార్టీ ఆదేశాల మేరకు తమ ఎంపీ పదవులకు రాజీనామా చేసి, తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆరు రోజుల పాటు నిరాహార దీక్ష చేశారు వైసీపీ ఎంపీలు మిథున్ రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి, వరప్రసాద్, సుబ్బా రెడ్డి.ఇప్పుడు తమ రాజీనామాలపై మేకపాటి స్పందించారు ఎంపీ మేకపాటి. ఈ నెల 29 న లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ని కలుస్తామని, రాజీనామాలను ఆమోదించమని ఒత్తిడి తెస్తామని చెప్పారు. తమ రాజీనామాలను లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ఆమోదిస్తారనే నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి.
 
ప్రత్యేక హోదాను సజీవంగా ఉంచింది వైసీపీనే అని, మా అధినేత ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నారని చెప్పారు ఆయన...రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలంటే ప్రత్యేక హోదా ఒక్కటే మార్గం... అందుకే ప్రత్యేక హోదా వచ్చే వరకు మా పోరాటం ఆగదని అన్నారు మేకపాటి...మా పార్టీ నాయకులు ప్రత్యేక హోదాపై పోరాడుతుంటే చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు...చంద్రబాబుకు నైతిక విలువలు లేవని, అందుకే ప్రజల కోసం నిరంతరం కష్టపడుతున్న వారికే వచ్చే ఎన్నికల్లో పట్టం కట్టాలని అన్నారు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.