మిథున్ రెడ్డి కోరిక బాబు తీర్చేనా...

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-15 04:48:47

మిథున్ రెడ్డి కోరిక బాబు తీర్చేనా...

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అస‌లైన రాజ‌కీయాలు ఇప్పుడు మొద‌ల‌య్యాయి. బ‌డ్జెట్ లో ఏపీకి జ‌రిగిన అన్యాయం విష‌యంలో  భార‌తీయ జ‌న‌తా పార్టీని దోషిగా నిల‌బెట్టేందుకు అధికార, ప్ర‌తిప‌క్షాలు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే  వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశాల మేర‌కు ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌క‌పోతే  ఏప్రిల్ 6 న రాజీనామాలు చేసేందుకు సిద్ద‌మ‌య్యారు వైకాపా ఎంపీలు.
 
అయితే, ఉప ఎన్నిక‌లు జ‌ర‌గ‌వ‌నే ఉద్దేశ్యంతో కావాల‌ని రాజీనామా డ్రామాకు తెర లేపిందంటూ టీడీపీ నేత‌లు వైసీపీ ఎంపీల‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు రాజీనామా చేయని వైసీపీ ఎంపీలు కేవ‌లం వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఓట్ల కోసం ఇలా కొత్త నాట‌కం ఆడుతున్నార‌ని టీడీపీ ఎద్దేవా చేస్తోంది.
 
టీడీపీ నేత‌లు చేస్తున్న‌విమ‌ర్శ‌ల‌పై రాజంపేట వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి స్పందించారు. ఎన్నిక‌ల సంఘం నిబంధ‌న‌ల ప్ర‌కారం జూన్ 4వ తేదీ వ‌ర‌కు తాము ఎంపీలుగా కొన‌సాగేందుకు అవ‌కాశం ఉంది. దీని ప్ర‌కారం మ‌ళ్లీ ఎన్నిక‌ల‌కు 15 నెల‌ల వ్య‌వ‌ధి ఉంది. ఇప్పుడు రాజీనామా చేస్తే ఉప ఎన్నిక‌లు జ‌రిపేందుకు అవ‌కాశం ఉంద‌ని మిధున్ రెడ్డి తెలిపారు. 
 
త‌మ అధినేత చంద్ర‌బాబు దేశ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పగ‌ల‌రని టీడీపీ నేత‌లు చెబుతున్నారు...అందుకే  త‌మ రాజీనామాల‌ను వెంట‌నే ఆమోదింప‌చేయాల‌ని మీడియా ద్వారా మిధున్ రెడ్డి చంద్రబాబును కోరారు. దీంతో పాటు వైసీపీ నుండి టీడీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలు, ఎంపీల చేత రాజీనామాలు చేయించి.... వారితో కూడా ఉప ఎన్నిక‌ల‌కు రావాల‌ని అన్నారు. మ‌రి మిధున్ రెడ్డి కోరిక‌ను చంద్ర‌బాబు తీరుస్తారో లేదో చూడాలి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.