లోకేశ్ కు అదిరిపోయే పద‌వి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ysrcp mp mitun reddy
Updated:  2018-06-05 06:20:35

లోకేశ్ కు అదిరిపోయే పద‌వి

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి మ‌రోసారి మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుపై, అలాగే ఆయ‌న కుమారుడు మంత్రి లోకేశ్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. టీడీపీ అధికారంలోకి వ‌చ్చాక విచ్చ‌ల విడిగా అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్నార‌ని, వీరి అవినీతికి అడ్డూ,అదుపు లేకుండా పోయింద‌ని మిథున్ రెడ్డి మండిప‌డ్డారు. 
 
ఇక తాజాగా ఎయిర్‌ ఏషియా స్కాంలో ముఖ్య‌మంత్రి అలాగే అశోక్ గ‌జ‌ప‌తి రాజు పేర్లు ఫోన్ టాపింగ్ లో బ‌య‌ట‌ప‌డ్డాయి. అయితే వాటిని చంద్ర‌బాబు క‌ప్పిపుచ్చుకునేందు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని, ఈ ప్ర‌య‌త్నాల నేప‌థ్యంలోనే వైసీపీ ఎంపీలు రాజీనీమాలాపై లేని పోని ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని మిథున్ రెడ్డి ఆరోపించారు. 
 
అలాగే నాలుగేళ్ల చంద్ర‌బాబు నాయుడి ప‌రిపాల‌న‌లో రాష్ట్రాన్ని ఏ విధంగా  అభివృద్దిచేశారో వివ‌రించాల‌ని మిథున్ రెడ్డి ప్ర‌శ్నించారు. ఈ నాలుగేళ్ల ప‌రిపాల‌న‌లో చంద్ర‌బాబు కుమారుడు మంత్రి నారా లోకేశ్ ను అవినీతి అక్ర‌మాల‌లో బ్రాండ్‌ అంబాసిడర్ గా ప్ర‌క‌టించాల‌ని ఈ సంర్భంగా ఆయ‌న పేర్కొన్నారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికింది మీ నాన్న చంద్రబాబే అని తెలుసుకో లోకేశ్ బాబు అంటూ మిథున్‌ రెడ్డి ఫైర్‌ అయ్యారు. ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్‌ జగన్‌ చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారని ఈ సంద‌ర్భంగా వెల్లడించారు.  
 
త‌మ‌కు త‌మ రాజీనామాల‌పై చిత్త‌శుద్ది ఉంద‌ని అందుకే రేపు స్పీక‌ర్ కార్యాల‌యంలో సుమిత్ర‌మ‌హ‌జ‌న్ కలిసి త‌మ రాజీనామాల‌ను ఆమోదించ‌మ‌ని కోరుతామ‌ని మిథున్ రెడ్డి సూచించారు. గ‌తంలో ప్ర‌త్యేక హోదా సాధ‌న‌ కోసం తాము అవిశ్వాస తీర్మానం పెడతాం త‌మ‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌మ‌ని చంద్ర‌బాబును అడిగితే మొద‌టిలో మ‌ద్ద‌తు ఇస్తామ‌ని చెప్పి యూ-ట‌ర్న్ తీసుకున్నార‌ని మిథున్ రెడ్డి గుర్తుచేశారు. 
 
ప్ర‌త్యేక హోదా వ‌స్తే రాష్ట్రం బాగుప‌డుతుంద‌ని గ్ర‌హించి తాము రాజీనామాల‌కు సిద్ద‌మైతే అప్పుడు టీడీపీ నాయ‌కులు రాజీనామాల ద‌గ్గ‌రకు వ‌చ్చే స‌రికి టీడీపీ పారిపోయింద‌ని మిథున్ రెడ్డి ఆరోపించారు. గ‌తంలో త‌మతో పాటు చంద్ర‌బాబు నాయుడు వారి ఎంపీల‌తో రాజీనామాలు చేయించి ఉంటే క‌చ్చితంగా కేంద్రం ప్ర‌త్యేక హోదా ఇచ్చేద‌ని మిథున్ రెడ్డి అన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.