మ‌రోసారి శ‌భాష్ అనిపించుకున్న మిథున్ రెడ్డి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-09 18:36:12

మ‌రోసారి శ‌భాష్ అనిపించుకున్న మిథున్ రెడ్డి

నిత్యం ప్ర‌జల్లో ఉండి ప్ర‌జాసేవే ల‌క్ష్యంగా ముందుకు వెళుతోంది పెద్దిరెడ్డి కుటుంబం.. తండ్రి నుంచి కొన్ని ల‌క్ష‌ణాలు అల‌వ‌ర‌చుకుంటారు కొంద‌రు..కాని పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి త‌న తండ్రి నుంచి ఎన్నో మంచి ల‌క్ష‌ణాల‌ను అల‌వ‌ర‌చుకున్నారు.. ముఖ్యంగా పేద‌ల‌కు సేవ చేయ‌డంలో ఆ కుటుంబం ముందు ఉంటుంది.. సాయం కావాల‌ని పెదాలు ప‌లికే లోపే, వారికి హామీ వ‌స్తుంది. అదీ పెద్దిరెడ్డి కుటుంబం ప్ర‌జ‌ల‌పై చూపించే ప్రేమ‌.
 
తాజాగా రాజంపేట ఎంపీ మ‌రోసారి త‌న విశాల హృద‌యాన్ని చాటుకున్నారు. రాజ‌కీయంగా దూసుకుపోతున్న ఎంపీ మిథున్ రెడ్డి ప్ర‌జాసేవ‌లో కూడా అదే విధంగా ముందుకు వెళుతున్నారు..నేడు చాలా విద్యాల‌యాల్లో స‌రైన సౌక‌ర్యాలు లేక విద్యార్దుల‌కు చ‌దువులు భోదించే స్కూళ్లు మ‌ర‌మ్మ‌తుల కోసం ఎదురుచూస్తున్నాయి.
 
కొద్ది నెల‌ల క్రితం రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి స‌ర‌స్వ‌తి విద్యామందిర్ పాఠ‌శాల‌కు వెళ్లారు.. అక్క‌డ విద్యార్దులకు స‌రైన సౌక‌ర్యాలు లేవ‌ని గుర్తించారు.. విద్యామందిరం మ‌ర‌మ్మ‌తులకు చూస్తోంది అని కళ్ల‌రా చూశారు ఆయ‌న‌.. దీంతో స‌ర‌స్వ‌తి విద్యామందిరం పాఠ‌శాల‌లో త‌న సొంత డ‌బ్బులు ల‌క్ష రూపాయ‌లు అంద‌చేశారు.. మ‌రోసారి మ‌న‌సున్న మారాజు అనిపించుకున్నారు ఆయ‌న‌.
 
పాఠ‌శాల‌ల మ‌ర‌మ్మ‌తుల‌కు ఆయ‌న త‌న సొంత డ‌బ్బులు ల‌క్ష రూపాయ‌లు ఆ పాఠ‌శాల వారికి అందించారు.. ఈ కార్య‌క్ర‌మానికి రాజంపేట పార్ల‌మెంట్ వైసీపీ అధ్య‌క్షులు అమ‌ర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్యే కొర‌ముట్ల శ్రీనివాసులు,క‌డ‌ప పార్ల‌మెంట్ అధ్య‌క్షులు సురేష్ బాబు పాల్గోన్నారు.. ఎంపీ చేసిన ప‌నికి పాఠశాల విద్యార్దులు తల్లి దండ్రులు ఆనందం వ్య‌క్తం చేశారు. ఎవ‌రైనా నాయ‌కులు ఎంపీ ల్యాడ్స్ నిధులు కేటాయిస్తారు కాని ఆయ‌న సొంత డ‌బ్బులు ఇవ్వ‌డం పై ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు అంద‌రూ.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.