వాటిని ఆయుధంగా చేసుకోండి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-28 15:06:51

వాటిని ఆయుధంగా చేసుకోండి

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి మ‌రోసారి మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి ఏపీ అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులుపై మండిప‌డ్డారు. 2014 ఎన్నిక‌ల్లో త‌ప్పుడు హామీల‌ను ప్ర‌క‌టించి అధికారంలోకి వ‌చ్చార‌ని అధికారంలోకి వ‌చ్చాక ఒక్క హామీని కూడా నెరవేర్చ‌లేద‌ని మిథున్ రెడ్డి ఆరోపించారు.
 
అందుకే వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌లంద‌రూ క‌లిసి సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకుని టీడీపీ అవినీతి అక్ర‌మాల‌ను, వారి వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌ట్టాల‌ని మిథున్ రెడ్డి వైసీపీ శ్రేణుల‌కు పిలుపునిచ్చారు.
 
ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, గ‌త నాలుగు సంవత్స‌రాల నుంచి టీడీపీ పాల‌న వ‌ల్ల రాష్ట్రంలో ఎటు చూసినా అవినీతి అక్ర‌మాల‌తో కూరుకుపోయింద‌ని అన్నారు. అయితే వాటిని పార ద్రోలేందుకు వైసీపీ శ్రేణులంతా ఏక‌మై సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకుని టీడీపీ వైఫ‌ల్యాల‌ను ప్ర‌జ‌ల‌కు తెలియ‌చేయాల‌ని మిథున్ రెడ్డి సూచించారు. 
 
దీంతో పాటు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్రతి ఓటూ కీలకమని, ప్రతీ ఒక్కరూ వైఎస్సార్ కాంగ్రెస్ కి ఓటు వేసి వైఎస్‌ జగన్‌ను సీఎం చేయాలని మిథున్ రెడ్డి కోరారు. వైఎస్‌ జగన్‌ ప్రకటించిన ‘నవరత్నాలతో పాటు ఆయ‌న చేస్తున్న ప్ర‌జాసంక‌ల్ప పాదయాత్రను కూడా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ అధికారంలోకి వ‌స్తే మ‌ళ్లీ రాష్ట్రంలో రాజ‌న్న పాల‌న ప్ర‌జ‌లు చూస్తారని మిథున్ రెడ్డి అన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.