జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయితే అది క‌చ్చితంగా చేస్తారు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-08 18:09:00

జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయితే అది క‌చ్చితంగా చేస్తారు

ఏపీ ప్ర‌తిప‌క్ష వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి మ‌రోసారి పార్టీ కార్యాలయంలో మీడియా స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ స‌మావేశంలో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడిపై సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు చేశారు మిథున్ రెడ్డి.చంద్ర‌బాబు నాలుగు సంవత్సారాల నుంచి రాష్ట్రంలో ఎక్క‌డైనా అభివృద్ది కార్య‌క్ర‌మాలు చేశారా అని ప్ర‌శ్నించారు.
 
రాష్ట్రానికి అమ‌ర సంజీవ‌నీ అయిన ప్ర‌త్యేక హోదా పై తమకు చిత్త శుద్ది ఉంది కాబ‌ట్టే ఎంపీలంద‌రం క‌లిసి ప‌ద‌వుల‌కు రాజీనామా చేశామ‌ని అన్నారు. అయితే త‌మ రాజీనామాల‌కు చంద్ర‌బాబు నాయుడు మ‌ద్ద‌తు ఇవ్వ‌కుండా వాటి గురించి అవ‌హేళ‌న‌గా మాట్లాడుతున్నార‌ని మిథున్ రెడ్డి ఆరోపించారు.
 
నాలుగు సంవ‌త్స‌రాల నుంచి ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాల‌తో పోరాడుతూనే ఉంద‌ని, అయితే ఈ విష‌యం రాష్ట్ర ప్ర‌జ‌లకు బాగా తెలుస‌ని మిథున్ రెడ్డి పేర్కొన్నారు. తాము ప్ర‌త్యేక‌ హోదాకు క‌ట్టుబ‌డి ఉన్నాము కాబ‌ట్టే త‌మ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ప్ర‌జ‌లు అడుగ‌డుగునా బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారని ఆయ‌న అన్నారు.
 
అయితే ఇప్పుడున్న ప‌రిస్థితిలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును న‌మ్మే స్థితిలో ప్ర‌జ‌లు లేర‌ని మిథున్ రెడ్డి తెలిపారు. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఒక్క అవ‌కాశం ఇస్తే గ‌తంలో రాజ‌శేఖ‌ర్ రెడ్డి ప‌రిపాల‌న ఎలా కొన‌సాగిందో అదే రీతిలో జ‌గ‌న్ ప‌రిపాల‌న చేస్తార‌ని మిథున్‌ రెడ్డి కోరారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.