టీడీపీ ఎంపీల‌కు వైసీపీ పిలుపు...

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-26 11:32:10

టీడీపీ ఎంపీల‌కు వైసీపీ పిలుపు...

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో రాజ‌కీయాలు  ఊహించ‌ని విధంగా మ‌లుపులు తిరుగుతున్నాయి.  ఓ వైపు కేంద్ర ప్ర‌భుత్వ తీరుపై వైసీపీ, టీడీపీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తుంటే, మ‌రోవైపు రాయ‌ల‌సీమకు న్యాయం చేయాల‌నే అంశాన్ని తెర‌పైకి తీసుకువ‌చ్చింది భార‌తీయ జ‌న‌తా పార్టీ. 
 
ప్ర‌త్యేక హోదా అంశాన్ని ప‌క్క‌దారి ప‌ట్టించేందుకు ఏపీ క‌మ‌లం పార్టీ నేత‌లు  కొత్త నాట‌కానికి తెర‌లేపార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. సీమ‌కోసం కోర‌డం న్యాయ‌మే అయినా,  కేవ‌లం రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం ఎన్నిక‌ల ముందు బీజేపీ ఇలా వ్యూహాలు ర‌చిస్తోందని ప‌లువురు చెబుతున్నారు. 
 
అయితే అధికారంలో ఉన్న బీజేపీ ఎన్ని రాజ‌కీయ కుయుక్తులు ప‌న్నిన‌ప్ప‌టికీ వైయ‌స్సార్ కాంగ్రెస్  పార్టీ మాత్రం హోదా కోసం రాజీనామా చేసేందుకు సిద్దంగా ఉన్నారు. జ‌గ‌న్ ప్ర‌క‌టించిన‌ట్లుగా ఈ  పార్ల‌మెంట్ స‌మావేశాల్లో కేంద్ర ప్ర‌క‌ట‌న చేయ‌క‌పోతే ఏప్రిల్ 6 న రాజీనామా చేస్తామ‌ని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. 
 
తాము రాజీనామాలు చేసే స‌మ‌యంలో టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేసేందుకు క‌ల‌సి రావాల‌ని ఆయ‌న టీడీపీకి  పిలుపునిచ్చారు. హోదాపై చంద్ర‌బాబు పూట‌కో మాట మాట్లాడుతున్నారని, రాజీనామాలు చేసి చిత్త‌శుద్ది చాటు కోవాలని మిధున్ రెడ్డి అన్నారు...

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.