బాబుపై విజ‌య‌సాయి రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-23 14:50:58

బాబుపై విజ‌య‌సాయి రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు కేంద్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా పార్ల‌మెంట్ లో ప్ర‌వేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం విరిగిపోయిన‌టువంటి విషయాన్ని ఏపీ ప్ర‌జ‌ల‌కు తెలిసిపోయింద‌ని ప్రతిప‌క్ష వైఎస్సా కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి మండిప‌డ్డారు.
 
అయితే ఇప్పుడు స‌భ‌లో అవిశ్వాసం విరిగిపోయిన త‌ర్వాత టీడీపీ నాయ‌కులు ప్ర‌త్యేక హోదాని సాదిద్దామ‌న్న ఆలోచ‌న ఉందా అని ప్ర‌శ్నించారు. గ‌తంలో వైసీపీ నాయ‌కులు ప్ర‌వేశ పెట్టిన‌టు వంటి అవిశ్వాస తీర్మానాన్ని బీజేపీ నాయ‌కులు స‌భ‌లో చ‌ర్చ జరగ‌నివ్వ‌కుండా చేశార‌ని విజ‌య‌సాయి రెడ్డి మండిప‌డ్డారు.
 
ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకుని ప్ర‌త్యేక హోదా బ‌దులు ప్ర‌త్యేక ప్యాకేజి విడుద‌ల చేయించుకున్నార‌ని విజ‌య‌సాయి రెడ్డి మండిప‌డ్డారు. అయితే ఆయ‌న నిధుల‌ను ఎప్పుడు విడుద‌ల చేయించుకున్నారో  ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌ని ప్ర‌శ్నించారు. ఇక ఇప్పుడు ఎన్నిక‌లు ద‌గ్గ‌రుకు వ‌చ్చే స‌రికి హటాత్తుగా ప్ర‌త్యేక హోదా గుర్తుకు వచ్చిందా అని విజ‌య‌సాయి రెడ్డి ఆరోపించారు. 
 
 ప్ర‌త్యేక హోదా విష‌యంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఎక్కడికి పోయిందని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఇకనైనా రాజకీయ డ్రామాలను మానుకోవాలని విజ‌య‌సాయి రెడ్డి ఆరోపించారు. రాష్ట్రానికి బీజేపీతో పాటు టీడీపీ, కాంగ్రెస్‌లు కూడా ద్రోహం చేశాయని అన్నారు. కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రభుత్వాన్ని నిలబెట్టిందే చం‍ద్రబాబు అని తెలిపారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.