చంద్ర‌బాబు ఆడా కాదు మ‌గా కాదు అందుకే వైసీపీ మ‌ద్ద‌తు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-19 18:32:36

చంద్ర‌బాబు ఆడా కాదు మ‌గా కాదు అందుకే వైసీపీ మ‌ద్ద‌తు

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగు దేశంపార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు నాలుగు సంవ‌త్స‌రాలు భార‌తీయ జ‌న‌తా పార్టీతో మిత్ర‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రించిన‌ప్పుడు ప్ర‌త్యేక హోదా వ‌ల్ల ఏం ఉప‌యోగం లేద‌ని, ప్ర‌త్యేక ప్యాకేజీ వ‌ల్లే రాష్ట్రానికి అనేక ఉప‌యోగాలు ఉంటాయ‌ని చెప్పి, ఇప్పుడు ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో యూట‌ర్న్ తీసుకున్నార‌ని వైసీపీ ఎంపీ విజ‌య సాయిరెడ్డి మండిడ్డారు.
 
ఈ రోజు దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కేవ‌లం ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర సానుభూతి పొంద‌డానికి మాత్ర‌మే కేంద్రం పై అవిశ్వాస తీర్మానం పెడుతున్నారు త‌ప్ప హోదా సాధ‌న కోసం కాద‌ని ఆయ‌న విమ‌ర్శ‌లు చేశారు. కేంద్రానికి వ్య‌తిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టింది త‌మ పార్టీ నాయ‌కులే అని విజ‌య‌సాయి రెడ్డి స్ప‌ష్టం చేశారు.
 
అయితే సాధార‌ణంగా ఫ‌స్ట్  జెండ‌ర్, సెకెండ్ జెండ‌ర్, ట్రాన్స్ జెండ‌ర్ అనే మూడు ర‌కాలు ఉంటాయని అయితే ఈ మూడు కాద‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఫోర్త్ జెండ‌ర్ అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు విజ‌య‌సాయి రెడ్డి. ఆయ‌న ఆడ‌కాదు మ‌గ కాద‌ని ప్ర‌కృతి కార్యంలో కూడా రెండురోళ్ల‌ను పాటించ క‌లిగిన‌టువంటి వ్యక్తి చంద్ర‌బాబు నాయుడ‌ని మండిడ్డారు. 
 
ఒక ముఖ్య‌మంత్రిగా ఆంధ్ర రాష్ట్రానికి ప్ర‌జ‌లంద‌రిని మోసం చేస్తూ ప్ర‌జా ధ‌నాన్ని విదేశాల‌కు త‌ర‌లిస్తున్నార‌ని విజ‌య‌సాయిరెడ్డి మండిప‌డ్డారు. చంద్రబాబు ఓ వైపు బీజేపీతో రహస్య ఒప్పందం కొనసాగిస్తూనే.. మరోవైపు అవిశ్వాస తీర్మానాన్నిపెడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ కేంద్రం పై అవిశ్వాసం పెట్టిన‌ప్పుడు దానివ‌ల్ల ఉప‌యోగం లేద‌న్న చంద్ర‌బాబు ఇప్పుడు యూట‌ర్న్ తీసుకుని ఎందుకు అవిశ్వాస తీర్మానం పెట్టార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. 
 
గతంలో చెప్పిన విధంగా కేంద్రం పై ఎవ‌రు అయితే అవిశ్వాసం పెడతారో వారికి మ‌ద్ద‌తు తెలుపుతామ‌ని చెప్పాము కాట్టి మా దౌర్భాగ్యం కొద్ది తాము టీడీపీ దొంగ‌ల‌కు మ‌ద్ద‌తు తెలుపుతున్నామ‌ని విజ‌య‌సాయి రెడ్డి స్ప‌ష్టం చేశారు. ప్ర‌స్తుతం లోక్ సభలో తమ సభ్యులు లేకపోయినా కూడా వారికి సంఘీభావం ప్రకటిస్తామని తెలిపారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.