సంచ‌ల‌నం జ‌గ‌న్ కు ప‌వ‌న్ మ‌ద్ద‌తు డైలమాలో చంద్ర‌బాబు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-23 12:41:58

సంచ‌ల‌నం జ‌గ‌న్ కు ప‌వ‌న్ మ‌ద్ద‌తు డైలమాలో చంద్ర‌బాబు

2014లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు అధికారంలోకి రావ‌డాని ముఖ్య‌కార‌ణం జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ అని చెప్పాలి. ఎందుకంటే ఆయన‌ అభిమానులు, కాపు కులాల‌కు చెందిన వారంద‌రూ ప‌వ‌న్ ఆదేశాల మేర‌కు టీడీపీకి ఓట్లు వేసి చంద్ర‌బాబు నాయుడుని ముఖ్య‌మంత్రిని చేశారు. గుంటూరు, కృష్ణా, ప‌శ్చిమ గోదావరి జిల్లాల్లో కాపు కుల‌స్థులు ఎక్కువ‌గా ఉన్నారు.వారంద‌రూ టీడీపీకే ఓట్లు వేసి చంద్ర‌బాబుకు అధికార ప‌గ్గాల‌ను అప్ప‌గించారు. 
 
అంతేకాదు 2014 లో టీడీపీ అధికారంలోకి వ‌స్తే కాపుల‌ను బీసీల్లో చేరుస్తాన‌ని చెప్పారు. కానీ ఇంత వ‌ర‌కూ కాపుల‌ను చంద్ర‌బాబు బీసీల్లో చేర్చ‌లేదు. దీంతో కాపు కుల‌స్తుల‌తో పాటు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా ఆగ్ర‌హం చెందారు. గ‌తంలో ఇదే విష‌యంపై ప‌వ‌న్‌ చాలాసార్లు ముఖ్యమంత్రి ద‌గ్గ‌ర ప్ర‌స్తావించారు. కానీ చంద్ర‌బాబు ఈ విష‌యంపై కేర్ చేయ‌లేదు. దీంతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొద్దిరోజుల క్రితం టీడీపీ మిత్ర‌ప‌క్షానికి గుడ్ బై చెప్పి రాష్ట్రవ్యాప్తంగా పార్టీ త‌ర‌పున సొంతంగా ప‌ర్య‌టిస్తున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడి నుంచి ఆయ‌న కుమారుడు మంత్రి లోకేశ్ తోపాటు, టీడీపీ ఎమ్మెల్యేల అవినీతి చిట్టా త‌న ద‌గ్గ‌ర ఉంద‌ని చెప్పి వారంద‌రికీ ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించారు. 
 
ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్  వైసీపీకి మ‌ద్ద‌తు ఇస్తార‌ని వార్తలు వ‌చ్చాయి. కానీ ఆ విష‌యంపై ప‌వ‌న్ ఇంత‌వ‌ర‌కూ స్పందించ లేదు. అయితే తాజాగా ప్ర‌త్యేక హోదా కోసం రాజీనామ చేసిన వైసీపీ తిరుప‌తి ఎంపీ వ‌ర‌ప్ర‌సాద్ రావు ఈ విష‌యంపై క్లారిటీ ఇచ్చారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ వైసీపీకి మ‌ద్ద‌తు ఇస్తార‌ని చెప్పి సంచ‌ల‌నం రేపారు. మీడియాతో ఆయ‌న మాట్లాడుతూ, గ‌తంలో  వైసీపీకి మద్దతిస్తామని పవన్‌ తనతో స్వయంగా అన్నారని తెలిపారు. చంద్రబాబు చేసే అవినీతి నచ్చకే జగన్‌తో కలవడానికి జనసేన అధినేత సిద్ధపడ్డారని చెప్పారు. పవన్‌, చంద్రబాబుతో విభేదించినందున వైసీపీతో కలిసే అవకాశం ఉందని అన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.