జ‌గ‌న్ అలా చేయక‌పోతే నేను పోటీ చేయ‌ను వ‌ర‌ప్ర‌సాద్ సంచ‌ల‌న నిర్ణ‌యం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-25 14:16:56

జ‌గ‌న్ అలా చేయక‌పోతే నేను పోటీ చేయ‌ను వ‌ర‌ప్ర‌సాద్ సంచ‌ల‌న నిర్ణ‌యం

ఏపీ ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ తిరుప‌తి ఎంపీ వ‌ర‌ప్ర‌సాద్‌ రావు మ‌రోసారి పార్టీ కార్యాల‌యంలో మీడియా స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ స‌మావేశంలో ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడునే కాకుండా  వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం టీడీపీ అధికారంలో బీసీలకు తీవ్ర‌స్థాయిలో అన్యాయం జ‌రుగుతోంద‌ని ఆయ‌నపై విమర్శ‌లు చేశారు. ఇప్పుడున్న పరిస్థితిల్లో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఒక్క‌డే బీసీల‌కు న్యాయం చేస్తార‌ని వ‌ర‌ప్ర‌సాద్ రావు అభిప్రాయ‌ప‌డ్డారు.
 
ఇక జ‌గ‌న్ కూడా ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడులాగ బీసీల‌కు అన్యాయం చేస్తే తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున‌ పోటీ చేయ‌న‌ని స్ప‌ష్టం చేశారు. తాను రాజకీయ నాయ‌కుడినే అయినా త‌న‌లో కూడా బీసీల ర‌క్తం స‌గం ఉందని అన్నారు. శ్రీకాళ‌హ‌స్తిలో ఏర్పాటు చేసిన బీసీల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ, చంద్ర‌బాబు నాయుడు ఎప్పుడైతే ముఖ్య‌మంత్రి అయ్యారో అప్ప‌టి నుంచి బీసీల‌కు అన్యాయం జ‌రుగుతుంద‌ని వ‌ర‌ప్ర‌సాద్ మండిప‌డ్డారు. 
 
2014లో త‌ప్పుడు హామీల‌ను ప్ర‌కటించి అధికారంలోకి వ‌చ్చిన చంద్రబాబు నాయుడు నాలుగు సంవ‌త్స‌రాలు అయినా ఒక్క హామీను కూడా పూర్తిగా అమ‌లు చేయ‌లేద‌ని మండిప‌డ్డారు. హామీల‌ను అమ‌లు చేయ‌క‌పోవ‌డ‌మే కాకుండా అధికార బ‌లంతో అక్ర‌మంగా ప‌రిశ్ర‌మ‌ల‌పేరు చెప్పి ఏపీలో ఉన్న రైతుల‌ భూముల‌ను టీడీపీ స‌ర్కార్ లాక్కుంటుంద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. ఇక ఈ అరాచ‌కాల‌పై ప్ర‌తీ ఒక్క‌రు పోరాటం చేయాల‌ని మాజీ ఎంపీ వ‌ర‌ప్ర‌సాద్ స్ప‌ష్టం చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.