విజ‌య‌సాయి రెడ్డి బంప‌ర్ ఆఫ‌ర్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-20 04:59:19

విజ‌య‌సాయి రెడ్డి బంప‌ర్ ఆఫ‌ర్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో 2014 ఎన్నిక‌ల త‌ర్వాత రాజ‌కీయాలు వేగంగా మారిపోయాయి. వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాక‌పోవ‌డంతో  ఆ పార్టీకి చెందిన  ఎమ్మెల్యేలు మంత్రి ప‌ద‌వుల‌కు ఆశ‌ప‌డి కొంద‌రు, ఇత‌ర ప్ర‌లోభాల‌కు గురై  మ‌రికొంద‌రు అధికార తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించారు.
 
టీడీపీకి సేవ‌లందిస్తున్న తెలుగు త‌మ్ముళ్లు ఉన్న‌ప్ప‌టికీ నియోజ‌క‌వ‌ర్గాల పునర్విభ‌జ‌న జ‌రుగుతుంది...వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ నుండే ఎమ్మెల్యేగా సీటు ల‌భిస్తుంద‌ని ఫిరాయింపు ఎమ్మెల్యేలు అత్యాస ప‌డ్డారు. 
 
తీరా చూస్తే నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న సాధ్యం కాద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తేల్చిచెప్ప‌డంతో ఫిరాయింపు ఎమ్మెల్యేల ప‌రిస్ధితి క‌లుగులో ఇరుక్కున ఎలుక‌లా త‌యారైంది. దీంతో అన‌వ‌స‌రంగా  పార్టీ మారామంటూ   ఫిరాయించిన‌ వైకాపా ఎమ్మెల్యేలు బ‌హిరంగంగానే ల‌బోదిబోమంటున్నారు. 
 
టీడీపీకి నేను అమ్ముడు పోయానంటూ కోడుమూరుకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే మ‌ణిగాంధీ  చేసిన ప్ర‌క‌ట‌న ఇప్పుడు రాష్ట్రంలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దీంతో  పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల‌తో పాటు,టీడీపీ ఎమ్మెల్యేల‌కు వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయి రెడ్డి బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించారు. 
 
మా పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిన వారు తిరిగి వ‌స్తే స్వాగ‌తిస్తామ‌ని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి వ‌చ్చేందుకు సిద్దంగా ఉన్నార‌ని విజ‌య‌సాయి రెడ్డి ప్ర‌క‌ట‌న చేశారు. అయితే టీడీపీ నుండి వ‌చ్చే ఎమ్మెల్యేలు రాజీనామా చేసి వైసీపీలోకి రావాల‌ని విజ‌య‌సాయి రెడ్డి అన్నారు. 
 
మ‌రి నిజంగానే టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి వ‌చ్చేందుకు సిద్దంగా ఉన్నారా.....లేక విజ‌య‌సాయి రెడ్డి వ్యూహాత్మ‌క రాజ‌కీయాలు మొద‌లుపెట్టారా.....ఏది ఏమైనా ఫిరాయింపు ఎమ్మెల్యేలు  చేసిన త‌ప్పును స‌రిదిద్దుకునేందుకు వైసీపీ ఇచ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుంటారో లేదో చూడాలి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.