వైసీపీలోకి మంత్రి గంటా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-23 17:31:36

వైసీపీలోకి మంత్రి గంటా

ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర‌కు ప్ర‌జ‌లు అడుగ‌డుగునా బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ప్ర‌జ‌లు జ‌గ‌న్ కు ప‌డుతున్న బ్ర‌హ్మ‌ర‌థాన్ని చూసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న‌టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు అంద‌రూ పాద‌యాత్ర చేస్తున్న‌ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని క‌లిసి ఆయ‌న‌ స‌మ‌క్షంలో టీడీపీ నాయ‌క‌లు త‌మ అనుచ‌రుల‌తో వైసీపీ తీర్థం తీసుకున్నారు.
 
ఇక‌ ఇప్ప‌టికే కృష్ణా జిల్లాలో టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు య‌ల‌మంచిలి ర‌వి అలాగే ప్ర‌ముఖ్య పారిశ్రామికవేత్త కృష్ణప్రసాద్‌, తన తండ్రి, మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావుతో క‌లిసి వైసీపీలో చేరిన సంగ‌తి తెలిసిందే. ఇక తాజాగా అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి ప్ర‌ధాన అనుచ‌రుడు కోగ‌టం విజ‌య భాస్క‌ర్ రెడ్డి త‌న అనుచ‌రుల‌తో జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకున్న సంగ‌తి తెలిసిందే
 
ఇక ఇదే క్ర‌మంలో తెలుగుదేశం పార్టీకి చెందిన విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు త్వ‌ర‌లో వైసీపీ తీర్థం తీసుకోనున్నారు. ఈ విష‌యాన్ని సాక్షాత్తు వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి తెలిపారు. నిన్నఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు స‌మ‌క్షంలో కుట్ర రాజ‌కీయాలు, న‌మ్మ‌క‌ద్రోహం వంటి అంశాల‌పై ధ‌ర్మ‌పోరాట దీక్షను విశాఖ‌ప‌ట్నంలో నిర్వ‌హించారు. 
 
అయితే ఈ దీక్ష‌కు వ్య‌తిరేకంగా వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ఈ రోజు విశాఖ వైసీపీ కార్యాలాయం నుంచి పెద్ద ఎత్తున ర్యాలీని చేప‌ట్టారు. ఈ ర్యాలీకి వైసీపీ కార్య‌క‌ర్త‌లు,అభిమానులు, ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున త‌ర‌లి వ‌చ్చారు. ఇక ఈ ర్యాలీలో పాల్గొన్న విజ‌యసాయి రెడ్డితో స‌హా వైసీపీ నేత‌లంద‌రిని టీడీపీ స‌ర్కార్ అక్రమంగా అరెస్ట్ చేయించి పోలీస్ స్టేష‌న్ కు త‌ర‌లించారు.
 
అరెస్ట్ అయిన త‌ర్వాత విజ‌య‌సాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, చంద్ర‌బాబు నాయుడు విచ్చ‌ల‌విడిగా ప్ర‌జాధ‌నాన్ని అక్ర‌మంగా దోచ‌కుంటున్నార‌ని, ఆయ‌న‌ దోచుకునేందుకే అధికారంలోకి వ‌చ్చార‌ని విజ‌య‌సాయిరెడ్డి మండిప‌డ్డారు. చంద్ర‌బాబు పాల‌న‌లో మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌ని ఆయ‌న‌ ఆరోపించారు. ఇక దీంతో పాటు టీడీపీ మంత్రి గంటా శ్రీనివాసరావు పై కూడా ఫైర్ అయ్యారు ఆయ‌న‌. గంటా శ్రీనివాసరావు గోడ‌దూకేట‌టువంటి వ్యక్తి అని, ఆయ‌న‌ ఏ పార్టీ అధికారంలోకి వ‌స్తుందా అని ఎదురుచూసి ఆ పార్టీలోకి జంప్ అవుతార‌ని విజ‌య‌సాయి రెడ్డి మండిప‌డ్డారు.
 
మంత్రి ప‌ద‌విలో ఉన్న గంటాకు ప్ర‌జా సేవ ఎలా చేయాలో తెలియ‌ద‌ని, అత‌నికి డ‌బ్బుత‌ప్ప ఏది ప్ర‌ధానం కాద‌ని అన్నారు. నీతి నియ‌మాలు పాటించ‌ని గంటా శ్రీనివాసరావు ప్ర‌తిప‌క్షాన్ని విమ‌ర్శించేందుకు అర్హుడా అని విజ‌య‌సాయి రెడ్డి ప్ర‌శ్నించారు. గ‌తంలో కూడా ఆయ‌న ఎన్నో పార్టీలు మారాడ‌ని ఇప్పుడు కూడా అదే రీతిలో వైసీపీలో చేర‌డానికి పార్టీ  నాయ‌కులతో  సంప్ర‌దింపులు చేస్తున్నార‌ని విజ‌య‌సాయిరెడ్డి అన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.