విజ‌యసాయిరెడ్డి కామెంట్స్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-14 15:39:02

విజ‌యసాయిరెడ్డి కామెంట్స్

ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌ వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జాసంక‌ల్ప యాత్ర‌కు సంఘీభావంగా వైసీపీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి విశాఖ‌ప‌ట్నంలో పాద‌యాత్ర చేసి విజ‌యవంతం చేసిన సంగ‌తి తెలిసిందే. ఇక ఈ పాద‌యాత్ర‌కు టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు మ‌ద్ద‌తు తెలుప‌డంతో ప్ర‌స్తుతం టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేల‌కు మింగుడు ప‌డ‌టంలేద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు తెలుపుతున్నారు
 
అయితే ఇక తాజాగా విజ‌య‌సాయి రెడ్డి ఈ రోజు విశాఖ‌ప‌ట్నంలో విలేక‌ర్ల స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త‌ల‌పెట్ట‌బోతున్న బ‌స్సు యాత్ర‌పై ఆయ‌న స్పందించారు. ప్ర‌స్తుతం రాష్ట్రం అవినీతి, అక్ర‌మాల‌లో కూరుకుపోయింద‌ని వాటిపై ఎవ‌రైనా కానీ పోరాడితే సంతోషమే అని విజ‌య‌సాయి రెడ్డి స్ప‌ష్టం చేశారు. దీంతోపాటు ప్ర‌జా స‌మ‌స్య‌లను ఎవ‌రు ప‌రిష్క‌రించిన దానిని అభినందించాల్సిన విష‌యం అని అయ‌న పేర్కొన్నారు.
 
2014 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన తెలుగుదేశం పార్టీ నాయ‌కులు, అధికారాన్ని అడ్డు పెట్టుకుని విచ్చ‌ల‌విడిగా అవినీతి, అక్ర‌మాలకు పాల్ప‌డుతున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. అలాగే విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన ప్ర‌త్యేక హోదా, విశాఖ రైల్వేజోన్ వంటి అంశాల‌పై టీడీపీ నాయ‌కులు కేంద్రానికి అమ్ముడుపోయార‌ని విజ‌య‌సాయిరెడ్డి మండిప‌డ్డారు. పార్ల‌మెంట్ చివ‌రి స‌మావేశం రోజున స్పీక‌ర్ స‌భ‌ను వాయిదా వేసిన‌ప్పుడు వైసీపీ ఎంపీల‌తో పాటు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు త‌మ‌ ఎంపీల‌తో వారి ప‌ద‌వుల‌కు రాజీనామా చేయించి ఉంటే రాష్ట్రానికి ఇంత ప‌రిస్థితి వ‌చ్చేది కాద‌ని ఆయ‌న ఆరోపించారు.  
 
త‌న ఎంపీల‌తో రాజీనామా చేయించ‌లేని చంద్ర‌బాబు ఇప్పుడు ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టేందుకు ధ‌ర్మ‌పోరాట దీక్ష‌పేరుతో దొంగ దీక్ష‌లు చేస్తున్నార‌ని విజ‌య‌సాయి రెడ్డి మండిప‌డ్డారు. అయితే చంద్ర‌బాబు చేస్తున్న దీక్ష‌ల‌న్ని ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు త‌గిన‌ బుద్ది చెబుతార‌ని విజ‌య‌సాయి రెడ్డి ఆరోపించారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.