రాధాకృష్ణ నాకు మంచి మిత్రుడు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-03 18:49:37

రాధాకృష్ణ నాకు మంచి మిత్రుడు

లోక్ స‌భ వాయిదా ప‌డ‌టంతో నేడు వైసీపీ ఎంపీలు తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు దిల్లీ ప‌ర్య‌ట‌న పై ప‌లు వ్యాఖ్య‌లు చేశారు.. అస‌లు హ‌స్తిన ఎందుకు బాబు గారు వ‌చ్చారు ఇక్క‌డ ఫోటో సెష‌న్ జరుగుతోందా అని వైసీపీ విమ‌ర్శించింది. ఇక ఈయ‌న‌కు స‌పోర్ట్ చేసే మీడియా అని ఎల్లో మీడియాపై ఆయ‌న ఫైర్ అయ్యారు అదే స‌మ‌యంలో 
 
ప్ర‌ధానిపై విధేయ‌త చూపుతూ నోటీసులు ఇచ్చారు అని ఆ పేప‌ర్ రాస్తోంది ....ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక ఏం రాస్తున్నారో తెలుసుకోవాలి అని విజ‌య‌సాయిరెడ్డి అన్నారు... అస‌లు వారు ఏం రాస్తున్నారో అని నేను కూడా ఆ ప‌త్రిక‌కు స‌బ్ స్క్రైబ్ అయ్యా.. వారు నాకు నెల రోజులు అయింది డ‌బ్బులు తీసుకుని, అయినా నాకు పేప‌ర్ ఇవ్వ‌డం లేదు అని అన్నారు ఆయ‌న‌.... వారు ఎందుకు ప‌త్రిక ఇవ్వ‌డం లేదో తెలియ‌దు... అయితే నాకు రాధాకృష్ణ  మంచి మిత్రుడే, అయినా స‌రే ఎందుకులే అని ఇప్ప‌టి వ‌రకూ ఈ విష‌యం తెలియ‌చేయ‌లేదు.
 
ఇక రాధాకృష్ణ‌కు అనువ‌నువు శ‌రీరంలో తెలుగుదేశం ర‌క్తం ప్ర‌వ‌హిస్తోంది... అయితే పార్టీ పై అభిమానం ఉండ‌వ‌చ్చు కాని ఆయ‌న ముందు జ‌ర్న‌లిస్టు అనే విష‌యాన్ని మ‌ర్చిపోతున్నాడు.. మీడియా ఏ ఒక్క రాజ‌కీయ పార్టీకి అనుకూలంగా ఉండ‌కూడ‌దు... చాలా స‌మ‌తుల్యం పాటించాలి అని కోరుతున్నా.. రాధాకృష్ణ‌గారు చంద్ర‌బాబు తుమ్మితే అద్బుతం అంటారు.. ఇక ద‌గ్గితే ఇంత‌లా ఎవ‌రూ ద‌గ్గుతారు అని అంటారు.. ఇలాంటి జ‌ర్న‌లిజ‌మా మీరు చేసేది విలువ‌ల‌తో కూడిన‌ జ‌ర్నలిజం చేయాలి అని ఆయ‌న ఆర్కే కి సూచించారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.